Begin typing your search above and press return to search.

అప్ప‌ట్లో... ఈ రెండో న‌టుడు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   30 Sep 2016 9:28 AM GMT
అప్ప‌ట్లో... ఈ రెండో న‌టుడు ఎవ‌రు?
X
నారా రోహిత్ హీరోగా, శ్రీ‌విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో ‘అప్పట్లో ఒక‌డుండేవాడు’ అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో ఓ సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ‘అయ్యారే’ ఫేమ్ సాగ‌ర్ చంద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్ర‌చార పోస్ట‌ర్ల‌ను వినూత్నంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలోకి ఒక్కోపాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ.. ఆ పాత్రలో న‌టించిన న‌టుడి పాత చిత్రాన్ని పోస్ట‌ర్ గా విడుద‌ల చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే ‘విఠ‌ల్ సేట్ అనీ ఒక‌డు ఉండేవాడు’ అంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసి... కాంటెస్ట్ పెట్టారు. ఆ పోస్ట‌ర్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ ట్రెండ్ ని కొన‌సాగిస్తూ తాజాగా మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

తాజా పోస్ట‌ర్‌ ద్వారా ‘భోగ‌నాథ‌పురం శ్రీ‌ను’ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ పాత్ర‌లో న‌టించిన న‌టుడి చిన్న‌నాటి చిత్రాన్ని వేశారు. ఈ ప్ర‌చార చిత్రాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి ఈ సినిమా క‌థ అంతా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగుతుంది. దాని అనుగుణంగా ఈ చిత్రంలో ప‌నిచేసిన‌వారు 90ల‌లో దిగిన ఫొటోల‌ను ఇలా పోస్ట‌ర్స్ గా తీసుకురాబోతున్నారు. ఈ పోస్ట‌ర్స్ లో ఉన్న న‌టుల‌ను గుర్తుప‌డితే 70939 09777 నంబ‌ర్ కు వాట్సాప్ చెయ్యొచ్చు. ఎస్‌.ఎమ్.ఎస్. కూడా పంపొచ్చు. స‌రైన జ‌వాబులు పంపినవారికి ఆక‌ర్ష‌ణీయమైన బ‌హుమానాలు అంద‌జేస్తామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ద‌శ‌లో ఉంది. అక్టోబ‌ర్ ఆఖ‌రి వారంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్ ఈ చిత్రంలో ఒక పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఒక కీల‌క‌మైన పాత్ర‌లో శ్రీ‌విష్ణు క‌నిపిస్తాడు. ఒక సీరియ‌స్ కంటెంట్ ను సబ్జెక్ట్ గా తీసుకుని ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని చెబుతున్నారు. సో... ఈ గెస్సింగ్ గేమ్ ఇంకా కొన‌సాగుతుంద‌న్న‌మాట‌! మ‌రింకెందుకు ఆల‌స్యం... ఈ న‌టుడిని గుర్తుప‌ట్టిండి... గిఫ్ట్ ప‌ట్టండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/