Begin typing your search above and press return to search.

యంగ్ హీరో... సీనియర్ హీరోయిన్ బంధం!

By:  Tupaki Desk   |   7 Dec 2018 1:30 AM GMT
యంగ్ హీరో... సీనియర్ హీరోయిన్ బంధం!
X
హీరోలన్నాక హీరోయిన్ల తో లవ్వులో పడక పోతే స్టొరీ ఎలా సాగుతుంది? ఎలా సాగాలన్నా లవ్ లో పడాల్సిందే. కానీ ఒక్కోసారి రీల్ లవ్ కాస్తా రియల్ ఎఫైర్ గా మారుతుంది. కొన్నిసార్లు అది లవ్వుగా రూపాంతరం చెందుతుంది.. మరి కొన్ని సార్లు అది డెస్టినేషన్ వెడ్డింగ్ తో ముగుస్తుంది. అవేవీ లేకపోతే బ్రేకప్ అయ్యి లైఫ్ లో ఒక గుర్తుగా మిగిలిపోతుంది. తాజాగా మన టాలీవుడ్ లో ఒక యువహీరో.. సీనియర్ హీరోయిన్ల మధ్య ఇలా రిలేషన్ మొదలైందట.

ఆ యువ హీరో ఒక నిర్మాత తనయుడు. తను నటించే సినిమాలో హీరోయిన్ గా నటించే సీనియర్ బ్యూటీ కి పడి పోయాడు. లేకపోతే ఆ బ్యూటీనే మన టాల్.. హ్యాండ్సమ్ హీరో కు పడిపోయింది అనుకోండి. ఏదైతేనేం ఒకరికి ఒకరు పడిపోయారు. కాకపోతే ఆ హీరోయిన్ ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఓ దశాబ్దం దాటింది. కెరీర్లో ఎత్తు పల్లాలన్నీ చూసింది. టాప్ హీరోల దగ్గరనుండి యంగ్ హీరోల వరకూ అందరితో నటించింది. ఈ యువ హీరో ఇంకా అంత అనుభవం లేదు.. అంత లోతుగా ప్రపంచాన్ని చూడలేదు. అయినా ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు ఉంటున్నారని ఫిలిం నగర్ కోడై కోస్తోంది.

బాలీవుడ్ లో లేత హీరో.. ముదురు హీరోయిన్ల మధ్య లవ్ ఎఫైర్స్ .. పెళ్ళిళ్ళు చాలా కామన్ గానీ టాలీవుడ్ లో ఇలాంటివి చాలా అరుదు. దీంతో ఇప్పుడు ఈ జంట పైన అందరి కళ్ళు ఉన్నాయట. అంటే బాలీవుడ్ ట్రెండ్ ను ఇక్కడికి తీసుకొస్తారేమోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ రిలేషన్ ఎంత దూరం వెళుతుందో ఏంటో మనం కూడా వేచి చూడాలి.