Begin typing your search above and press return to search.

పనిలేని నటులకు ఇదేం పనండీ బాబూ..

By:  Tupaki Desk   |   27 July 2016 5:30 PM GMT
పనిలేని నటులకు ఇదేం పనండీ బాబూ..
X
అదేంటో తెలియదు కాని.. బాలీవుడ్డులో ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో బిజీగా లేని నటులందరూ ఏదో ఒక సెటైరికల్ కామెంట్ చేసి లైమ్ లైట్ లో ఉండాలని చూస్తున్నారు. ఆ మధ్యన దేశంలో జరిగిన కొన్న సంఘటనలను చూపిస్తే.. కొందరు అవార్డులను తిరిగిచ్చేస్తాం అంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. అదయ్యాక ఇప్పుడు ఈ సెటైర్ గ్యాంగ్ చూడండి ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు.

మొన్ననే నటుడు రాజేష్‌ ఖన్నా గురించి మాట్లాడుతూ.. ''తీసిన సినిమాలనే తీసి.. అవే రోల్స్ మళ్ళీ మళ్ళీ చేసి.. సినిమాలను బోర్ కొట్టించేశాడు రాజేశ్‌ ఖన్నా'' అంటూ కామెంట్లు చేశాడు సీనియర్ నటుడు నసీరుద్దీన్‌ షా. నిజానికి బాలీవుడ్లో రాజేష్‌ ఖన్నా అంటే ఎంత పెద్ద ఐకాన్ అనే సంగతి తెలిసిందే. అలాంటి నటుడిపై ఇవేం కామెంట్లో ఎవ్వరికీ అర్దంకాలేదు. ఇప్పుడేమో మరో నటుడు నానా పటేకర్ ను.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ కబాలి సినిమా చూశారా అంటే.. ''ఇండియాలో సూపర్ స్టార్లు ఎవ్వరూ లేరు. కేవలం సినిమాయే ఇక్కడ సూపర్ స్టార్‌. నచ్చితే చిన్న సినిమా అయినా కోట్లు వసూలు చేస్తుంది.. నచ్చకపోతే పెద్ద సినిమా అయినా డిజాష్టర్ అవుతుంది'' అంటూ హితబోధ చేశాడు. ఏదో తోటి మరాఠి వాడు కదా అని రజనీ గురించి అడిగితే.. ఇదే ఏడుపో మరి?

ఇదే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ.. పనిలేని నటులందరూ ఇలా పాపులార్టీ కోసం చెత్త కామెంట్లు చేస్తున్నారని.. ఎవరన్నా ఏదన్నా సాధించి అందుకోలేనంత ఎత్తుకి ఖ్యాతిని తీసుకెళితే.. వారిని ఎప్రీషియేట్ చేయాలి కాని.. ఈ సెటైర్లు ఎందుకు వేయడం అంటూ దుమ్ము దులిపేస్తున్నారు.