వేట మొదలుపెట్టిన కమ్ముల

Wed Jun 13 2018 13:17:05 GMT+0530 (IST)

ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఆ దర్శకుడు లేదా హీరో చేసే తరువాత సినిమా పైన అంచనాలు పెరిగిపోతాయి. అవి అలా ఉన్నప్పుడే మరొక సినిమాతో ముందుకు రావాలి. అప్పుడే హైప్ ఉంటుంది. కానీ శేఖర్ కమ్ముల దీనికి పూర్తి విరుద్ధం. ఫిదా సినిమాతో సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయటమే కాక వరుణ్ తేజ్ కి కెరీర్ లో పెద్ద హిట్ ఇచ్చాడు శేఖర్. ఇది జరిగి ఏడాది గడిచింది.కానీ శేఖర్ తరువాత సినిమా గురించి ప్రేక్షకులకు ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి కానీ ఇంకా షూటింగ్ మొదలు అవ్వలేదు. కనీసం కాస్టింగ్ పనులు కుడా మొదలవ్వలేదు. మూడు నెలల క్రితం శ్రీ రెడ్డి శేఖర్ పైన చేసిన ఘాటు వ్యాఖ్యల వల్ల కొంచెం దిగులు పడ్డాడు కానీ ఎవరూ అవి నమ్మకపోయేసరికి ఊపిరి పీల్చుకుని ఇప్పుడు తన సినిమాలో హీరో కోసం వేట మొదలుపెట్టాడు. హీరో కోసం స్టార్ హీరోలు కాదు కాని మీడియం రేంజ్ హీరో అయితే బావుంటుందని శేఖర్ నమ్మకం.

విజయ్ దేవేరకొండ - శర్వానంద్ - నాని లాంటి వాళ్ళు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాకపోతే ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల శేఖర్ ఏ హీరో ని అడిగినా వాళ్ళు కచ్చితంగా డేట్స్ ఇస్తారు. చూద్దాం హ్యాపీ డేస్ - లీడర్ - ఫిదా లాంటి మంచి సినిమాలను మన ముందుకు తెచ్చిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఎలాంటి కథతో ప్రేక్షకులకు మెప్పిస్తాడో.