Begin typing your search above and press return to search.

స్టార్ హీరో వారసుడితో శేఖ‌ర్ క‌మ్ముల మూవీ!

By:  Tupaki Desk   |   17 July 2018 5:15 AM GMT
స్టార్ హీరో వారసుడితో శేఖ‌ర్ క‌మ్ముల మూవీ!
X
కొంత‌మంది ద‌ర్శ‌కులు ఉంటారు. వారు ఎలాంటి సినిమా తీసినా.. మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు తీసే సినిమాలో హీరో ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? లాంటి ముచ్చ‌ట్లు ఉండ‌వు. ఆ ద‌ర్శ‌కుడు సినిమాకు ఓకే చెబితేనే అదో క్రేజీ ప్రాజెక్టుగా మారిపోవ‌ట‌మే కాదు.. ఆ చిత్రంపై అంచ‌నాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతూ ఉంటాయి.

అలాంటి కోవ‌కు చెందిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. యూత్ ప‌ల్స్ తో పాటు.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ప‌ల్స్ ను ఎలా ప‌ట్టుకోవాలో ఆయ‌న‌కు తెలిసినంత బాగా మ‌రెవ‌రికీ తెలీదేమో. తాను ఏ జోన‌ర్ మూవీ తీసినా.. త‌న‌దైన స్టైల్ ను ఏ మాత్రం మిస్ కాని వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. యూత్ ల‌వ్ స్టోరీ మాత్ర‌మే కాదు.. లీడ‌ర్ లాంటి పొలిటిక‌ల్ మూవీ.. ఆనామిక లాంటి థ్రిల్ల‌ర్ జోన‌ర్ లోనూ త‌న స‌త్తాను ప్ర‌ద‌ర్శించిన ఆయ‌న.. త‌న త‌ర్వాతి ప్రాజెక్టును త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ కుమారుడితో మూవీ చేయ‌నున్నారు.

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు.. త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన శేఖ‌ర్ క‌మ్ముల‌తో స్టార్ హీరో విక్ర‌మ్ కుమారుడు ధ్రువ్ త‌ర్వాతి మూవీ చేయ‌నున్నారు. ఒక సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను శేఖ‌ర్ క‌మ్ముల సిద్ధం చేశార‌ని.. ఆ క‌థ‌కు విక్ర‌మ్ కుమారుడు ఓకే చెప్పేయ‌టంతో ద్విభాషా చిత్రంగా ఈ మూవీని తీయ‌నున్నారు.

అర్జున్ రెడ్డి మూవీని త‌మిళ్ లో చేస్తున్న ధ్రువ్‌.. శేఖ‌ర్ క‌మ్ముల‌తో త‌ర్వాతి సినిమాను చేయ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. త‌మిళ్ లోనూ త‌న సినిమాల‌తో త‌న‌దైన ముద్ర వేసిన ద‌ర్శ‌కుడితో ధ్రువ్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్నారు. ఈ ప్రాజెక్టు వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా మీద అంచనాలు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. 2014లో న‌య‌న‌తార‌తో తీసిన అనామిక చిత్రం త‌ర్వాత త‌మిళ్ రిలీజ్ కానున్న మూవీ ఇదే కానుంది.