సీటీమార్ లో ఎవరు చేస్తున్నారమ్మా?

Thu Feb 22 2018 22:52:48 GMT+0530 (IST)


గబ్బర్ సింగ్ సినిమా తరువాత హరీష్ శంకర్ ట్రాక్ చాలా వరకు మెలికలు తీరుగుతోంది. ఒక పాటెర్న్ లో కాకుండా కథను బట్టి సినిమాను నడిపిస్తున్నాడు. ఎన్ని మార్చినా కమర్షియల్ ఎలిమెంట్స్ ని అలాగే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా హరీష్ శంకర్ సీటీమార్ అనే టైటిల్ తో ఒక సినిమాను చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ న్యూస్ బయటపడి కొన్ని గంటలు కాకముందే మరొక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అసలైన తారాగణం విషయం గురించి మొదట చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ ఎంత వరకు నిజం అనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న టాక్ ప్రకారం.. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న వరుణ్ తేజ్ సీటీమార్ హీరో అని తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే రూమర్స్ విషయానికి వస్తే ముందే సీటిమార్ పాయింట్ అల్లు అర్జున్ కి దర్శకుడు హారీష్ శంకర్ వినిపించాడని తెలుస్తోంది. దువ్వాడ జగన్నాథమ్ సక్సెస్ మీటింగ్ తరువాత ఇద్దరి మధ్య ముందే చర్చలు జరిగాయని టాక్. కానీ ఇంకా దర్శకుడు కూడా హీరో విషయంలో ఫైనల్ కాలేదని సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్ ద్రుష్టి మొత్తం దాగుడుమూతలు సినిమాపైనే ఉంది. దిల్ రాజు నిర్మించబోయే ఆ ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది.