తేజ-బెల్లంకొండ సినిమా టైటిల్ ఇదే

Thu Dec 06 2018 21:24:55 GMT+0530 (IST)

యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో మొదటి సారి రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. అందులో ఒక సినిమా 'కవచం'.  ఈ చిత్రం శుక్రవారం(డిసెంబర్ 7)నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాగా దర్శకుడు మామిళ్ళ శ్రీనివాస్.  రెండో సినిమా సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్.  బెల్లకొండ శ్రీనివాస్ - తేజ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది.  తేజ అండ్ టీమ్ ఈ సినిమాకు 'సీత' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో సీత అనే పాత్రలో కాజల్ నటిస్తోందట.  కథ ముఖ్యంగా ఆ పాత్ర చుట్టూ తిరిగేది కావడంతో టైటిల్ ను 'సీత' అని డిసైడ్ అయ్యారట.   హీరోయిన్ క్యారెక్టర్ ను టైటిల్ గా లాక్ చేశారంటే సజహంగా కథలో స్టఫ్ ఉందనే అభిప్రాయం ఉంటుంది. ఎక్కువగా మాస్ ఎంటర్టైనర్లు చేసే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టడం నిజంగా ఒక సర్ ప్రైజ్. ఏదేమైనా టైటిల్ మాత్రం క్యాచీగా ఉంది.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మన్నార చోప్రా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ 80% శాతం పూర్తయిందని సమాచారం.  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో నిర్మాతలు ఉన్నారు.  ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.