Begin typing your search above and press return to search.

రెచ్చ‌గొట్టే డ్రెస్సులేసినా క‌లిసిరావ‌ట్లేదు

By:  Tupaki Desk   |   26 April 2018 9:49 AM GMT
రెచ్చ‌గొట్టే డ్రెస్సులేసినా క‌లిసిరావ‌ట్లేదు
X
సినిమా అవ‌కాశాలు ఉంటే ఫ‌ర్వాలేదు లేక‌పోతే మాత్రం ఎక్కువ మంది అప్‌క‌మింగ్ హీరోయిన్లు చేసే ప‌ని హాట్ ఫోటో షూట్‌లు. ఇందులో ఆరితేరిపోయింది ర‌న్ రాజా రన్ హీరోయిన్ సీర‌త్ కపూర్‌. ఆ సినిమా వ‌చ్చిన స‌క్సెస్ తో అవ‌కాశాలు ద‌క్కించుకుంది కానీ... ఆ సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో మ‌ళ్లీ తెర‌మ‌రుగైపోయింది. ఆమెకు మ‌ళ్లీ అవ‌కాశాలు వ‌చ్చేలా చేసింది హాట్ హాట్ డ్రెస్సుల‌తో అమ్మాయి ఇచ్చిన ఫోజులే. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ప‌రిస్థితి ఏం బాగో లేదు. ఇప్పుడేం చేస్తుంది సీర‌త్ క‌పూర్‌?

ర‌న్ రాజ ర‌న్ త‌రువాత టైగ‌ర్ కొలంబ‌స్ సినిమాల‌లో న‌టించింది. అవి అట్ట‌ర్ ఫ్లాపు అయ్యాయి. దీంతో సీర‌త్ సినిమాలు లేక ఖాళీ అయిపోయింది. ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది సినీ జ‌నాల దృష్టిలో ప‌డాలి క‌దా అని పొట్టి పొట్టి డ్రెస్సులు క్లీవేజ్ షోల‌తో అందాల క‌నువిందు చేస్తూ ఫోటోలు దిగింది. వాటిని త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీంతో ద‌ర్శక నిర్మాత‌లు కూడా ముందుకొచ్చి అవ‌కాశాలు ఇచ్చారు. రాజుగారి గ‌ది2 గ్లామ‌ర్ డాల్ లా క‌నిపించింది. ఆ వెంటనే అల్లు శిరీష్ సుర‌భి హీరో హీరోయిన్లుగా చేసిన ఒక్క క్ష‌ణం సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఆ రెండు ఫ‌ర్వాలేద‌నిపించాయి. ఆ త‌రువాత ట‌చ్ చేసి చూడులో కూడా క‌నిపించింది ముద్దుగుమ్మ‌. ఆ సినిమా మ‌ళ్లీ అట్ట‌ర్ ఫ్లాప్‌. సీర‌త్ కు అవ‌కాశాలు ఆగిపోయాయి. అమ్మ‌డికి చేతిలో ప‌ని లేకుండా పోయింది.

సీర‌త్ మ‌ళ్లీ హాట్ ఫోటో షూట్‌లు మొద‌లుపెట్టేసింది. స్కిన్ టైట్ గౌనులో కుర్ర‌కారును రెచ్చ‌గొట్టే ఫోజుతో ఫోటోల‌ను పోస్టు చేసింది. త్వ‌ర‌లో బికినీ వేసినా ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేదు. ఎంత‌కీ సినిమా అవ‌కాశాలు రాకుంటే ఆ ప‌నే చేస్తుంది సీర‌త్‌. చూద్దాం అందాల క‌నువిందు ఆమెకు ఎన్ని అవ‌కాశాలు తెచ్చిపెడుతుందో.