గ్లామర్ లేదు.. హీరోయిన్ కాదు..

Tue Dec 12 2017 23:00:01 GMT+0530 (IST)

అవకాశాలు రాకుంటే హాట్ ఫొటో షూట్స్ చేసుకుని అవకాశాలు అందుకున్న భామల్లో సీరత్ కపూర్ ఒకరు. అమ్మడి అందాలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పాలి. రన్ రాజా రన్ సినిమాలో కొంత గ్లామర్ గానే కనిపించి హిట్టు కొట్టినా ఆ తర్వాత ఎక్కువగా హిట్స్ అందుకోలేదు. అయితే ఆ వెంటనే టాప్ లెస్ అందాలతో ఫొటో షూట్స్ లో పాల్గొని వెంటనే రాజుగారి గది 2 సినిమాలోఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో అమ్మడు ఓ రేంజ్ లో గ్లామర్ ని బయటపెట్టేసింది.  అంతే కాకుండా మరో రెండు అవకాశాలను కూడా దక్కించుకుంది.ఇకపోతే సీరత్ ఒక్క క్షణం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. అయితే ఆ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సీరత్ పాత్ర కూడా సినిమాలో చాలా బావుంటుందట. అమ్మడు ట్రైలర్ లో ఒక పబ్ లో హంగామా చేస్తూ కనిపించింది. దీంతో అందరు మళ్లీ సీరత్ గ్లామర్ తో అదరగొట్టేట్లు ఉందని అనుకుంటున్నారు.  కానీ ఆమె పాత్ర కొత్తగా పెళ్లైన ఒక ఇల్లాలిగా కనిపించబోతోందట. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది.

'సినిమాలో నా పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురిగా కనిపించబోతోన్నాను. శ్రీనివాస్ అవసరాల నా సహా నటుడు. అతనితో కెమిస్త్రి బాగా సెట్ అయ్యింది. ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని నటించాం. ఇక దర్శకుడు విఐ.ఆనంద్ కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అతను చెప్పిన క్యారెక్టర్ బట్టి నా స్టైల్ లో నేను నటించా దీంతో చిత్ర యూనిట్ అందరికి నచ్చేసింది. సినిమా చాలా కొత్తగా థ్రిల్లింగ్ ఉంటుంది. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుంది' అని సీరత్ తెలిపింది.      

అంటే ఇక్కడ రెండు పాయింట్లు అర్ధంచేసుకోవచ్చు. ఒకటి ఈమె సినిమాలో పెద్దగా గ్లామర్ డోస్ ఇవ్వలేదని.. రెండోది అసలు ఈమె సెకండ్ హీరోయిన్ కూడా కాదని. మరి సడన్ గా ఇలాంటి పాత్రను ఎందుకు చేశావ్ సీరత్?