ఈ సైన్స్ ఫిక్షన్ తో దశ తిరుగుతుందట

Sun Aug 13 2017 11:24:35 GMT+0530 (IST)

రన్ రాజా రన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా సీరత్ కపూర్ ప్రస్తుతం నిజ నిజ షెడ్యూల్ తో ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఆఫర్లు లేని ఈ అమ్మడికి  ఆ మధ్య ఇచ్చిన ఓ ఘాటైన ఫోటో షూట్ బాగానే హెల్ప్ అయినట్టుంది. సీరత్ అందాలకు చాలా మంది ఫిదా అవ్వడంతో సినిమాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రలను దక్కించుకుంటోంది.



ఇప్పటికే నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజు గారి గది సినిమాలో మరియు "రవి తేజ-టచ్ చేసి చూడు" లో కూడా మంచి ఛాన్స్ లనే  కొట్టేసింది ఈ భామ. అయితే రీసెంట్ గా మరో ఛాన్స్ కొట్టేసింది.  అల్లు శిరీష్ నటించబోయే ఓ సైన్స్ ఫిక్షన్ కథలో కథను మలుపుతిప్పే హీరోయిన్ గా నటిస్తోందట. అంతే కాకుండా ఆ పాత్రలో ఈ అమ్మడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పి అందరిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

ఆ సినిమాలో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల యువతీ కథ ఎలా  మలుపు తీరుగుతుంది. ఆమె చేసిన తప్పుల వల్ల ఎలాంటి నరకాన్ని అనుభవిస్తుంది అనే కోణంలో నుండి వచ్చే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పింది సీరత్. ఈ చిత్రంలో తనతో పాటు అవసరాల శ్రీనివాస్ మరియు జెంటిల్ మెన్ సినిమాలోని ముద్దుగుమ్మ సురభి మరో కథానాయికగా నటిస్తోందట. ఇక ఈ సినిమాను "ఎక్కడికి పోతావు చిన్నవాడా" సినిమాను తెరకెక్కించిన విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు.