పరదా చాటు నుంచి పరువాల పంట

Thu Jan 12 2017 15:44:06 GMT+0530 (IST)

టాలీవుడ్ లో సీరత్ కపూర్ ప్రయత్నాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రన్  రాజా రన్ అంటూ టాలీవుడ్ కి పరిచయమైంది కెన్యా భామ. కెన్యాలో సెటిల్ అయిన ఇండియన్ కపుల్ కి పుట్టిన భామ కావడంతో.. ఇలా కెన్యా అయిపోయింది లెండి. అయితే.. రన్ రాజా రన్ తర్వాత ఈమెకు అవకాశాలు వరుసగానే వచ్చాయి.

టైగర్.. కొలంబస్ అంటూ ఒకే ఏడాది మూడు సినిమాల్లో చేసేసింది. ఆ తర్వాతే మళ్లీ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఫోటోషూట్ ద్వారా తన ట్యాలెంట్ తో పాటు.. టార్గెట్ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తోంది సీరత్ కపూర్. కర్టెన్ మాటు నుంచి తన అందాలను తెగ ప్రదర్శిస్తోంది. బ్లాక్ అండర్ గార్మెంట్స్ వేసుకుని.. అదే రంగు ఓవర్ కోటుతో.. సగం సగం సోకులు కనిపించేలా అమ్మడు ఇచ్చిన పోజులు భలే అదిరిపోయింది. అందాల ప్రేమికులకు కనివిందు కలిగించడంలో.. కొంచెం కూడా సంశయాలు పెట్టుకోలేదు ఈ చిన్నది.

నిజానికి ఈ బ్యూటీ బాలీవుడ్ డ్యాన్సర్ అయినా.. తెలుగులో మాత్రం యాక్ట్రెస్ గా సత్తా చాటేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ నుంచి ఇక పిలుపులు ఆగిపోయినట్లేనా అనుకుంటున్న టైంలో రాజుగారి గది2 చిత్రంలో నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసి మరీ ఒప్పేసుకుంది. మరి.. చేతిలో చాన్సులు లేని టైంలో నాగ్ సినిమాలో నటించే అవకాశం రావడం చిన్న విషయమా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/