సీరత్ శృతి మించేస్తోంది!!

Tue Mar 21 2017 10:12:36 GMT+0530 (IST)

రన్ రాజా రన్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన సీరత్ కపూర్.. టాలీవుడ్ లో బిజీ అయేందుకు తెగ ప్రయత్నాలు చేసేస్తోంది. సినిమా ఆఫర్స్ అందుకోవడమే కాదు.. మధ్యమధ్యలో ఫోటో షూట్స్ తో కూడా షాక్ ఇచ్చేస్తోంది సీరత్. కొన్ని రోజుల క్రితమే బికినీ ఫోటోతో హంగామా చేసిన టైగర్ భామ.. ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది.తాజాగా ఈమె చేసిన ఓ ఫోటోషూట్ హాట్ టాపిక్ అయిపోయింది. ఒంటిపై భారీ జ్యూవెలరీ ధరించి.. టాప్ లెస్ అనిపించేలా ఫోటోకు పోజ్ ఇచ్చేసింది సీరత్ కపూర్. తన పరువాలను దాచేందుకు.. తన కురులనే ఉపయోగించిందా అనిపించేలా పోటో షూట్ చేసింది. అయితే.. ఓ ఉన్ని కోటు ధరించింది కానీ.. అది స్కిన్ కలర్ కి దగ్గరగా ఉండడంతో.. మరో ఆచ్ఛాదన ధరించలేదా అనే అనుమానం వచ్చేయడం సహజం. టాలీవుడ్ హీరోయిన్లలో ఈ రేంజ్ లో అందాలు పరిచేసే ధైర్యం చాలా తక్కువమందికే ఉంటుంది.

ఇక సీరత్ సినిమాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం నాగార్జునతో కలిసి రాజుగారి గది2 లో నటిస్తోంది. ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో.. సమంత కూడా నటిస్తుండగా.. ఇది తప్పితే సీరత్ చేతిలో మరో సినిమా లేదు. కానీ స్కిన్ షో చేయడంలో అమ్మడి ట్యాలెంట్ చూశాక.. అవకాశాలు బాగానే వస్తాయంటున్నారు టాలీవుడ్ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/