తన బికినీ పోస్టర్ తనే విడుదల చేసింది

Thu Oct 12 2017 11:17:07 GMT+0530 (IST)


టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ సూపర్ హాట్ అనే సంగతి ప్రత్యేకించి డీటైల్డ్ గా చెప్పాల్సిన పని లేదు. గతంలో హిట్స్ కొట్టినా రానంత క్రేజ్ ను ఎలా సంపాదించుకోవాలో కరెక్ట్ రూట్ ను ఎంచుకున్న ఈమె.. సోషల్ మీడియా వేదికగా బాగానే హల్ చల్ చేసి పారేసింది. రోజుకో హాట్ ఫోటో చొప్పున షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను బాగానే వేడెక్కించింది.అలా వచ్చినా.. ఎలా వచ్చినా.. రాజు గారి గది2 చిత్రంలో నాగార్జున పక్కన నటించే అవకాశాన్ని మాత్రం పట్టేసింది సీరత్ కపూర్. రేపే ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడీ చిత్రానికి తన ఫస్ట్ లుక్ ను తనే రిలీజ్ చేసింది సీరత్ కపూర్. ఇలా ఒక రోజు ముందు ఫస్ట్ లుక్ అంటూ.. బికినీ వేర్ లో ఉన్న తన పోస్టర్ ను లాంఛ్ చేసుకోవడం వెనక ఓ రీజన్ ఉంది. నిజానికి ఈమె ఓ బికినీ సీన్ లో నటించిందని.. కానీ సెన్సారువారు ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా.. అమ్మడి కష్టాన్ని గుర్తించకుండా.. ఆ బికినీ సన్నివేశాన్ని కత్తెర వేశారనే టాక్ వచ్చింది. సినిమాకు కీలకమో కాదో చెప్పలేం కానీ.. ఆ బికినీ సీన్ సీరత్ కు మాత్రం చాలా ముఖ్యం. గ్లామర్ డాల్ యాంగిల్ ఇమేజ్ ని ఆపాదించడంలో.. బికినీల పాత్ర చాలా ఉంటుంది కదా.

ఇలా సీరత్ కపూర్ బికినీ సీన్ తీసేశారనే టాక్ కు చెక్ పెట్టేందుకు.. ఎంచక్కా తన పోస్టర్ ను తానే విడుదల చేసేసుకుంది సీరత్ . పైగా 'ఇక చెప్పింది చాలు. మీకో ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ ఇస్తున్నా' అంటూ ఈ ఎల్లో కలర్ టూ పీస్ బికినీలో తాను కనిపిస్తున్న ఫోటోను విడుదల చేసింది సీరత్ కపూర్.