Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌బొట్టుతో ప్రేమ చాటుకున్న న‌మ్ర‌త‌!

By:  Tupaki Desk   |   23 Aug 2016 10:50 AM GMT
ప‌చ్చ‌బొట్టుతో ప్రేమ చాటుకున్న న‌మ్ర‌త‌!
X
ప్రేమ‌ను ప్ర‌క‌టించ‌డంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో పంథా ఉంటుంది. కొంత‌మంది బ‌హుమ‌తులు ఇచ్చి ప్రేమ‌ను చాటుకుంటూ ఉంటారు. ఇష్ట‌మైన ప‌నులు చేసి ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించేవారు ఇంకొంద‌రు. ఇలా ఎవ‌రి భావ‌ప్ర‌క‌ట‌న వారికి ఉంటుంది. మ‌హేష్ బాబుకి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉంటే షూటింగ్ స్పాట్‌... లేదంటే ఇల్లు.. మ‌హేష్ బాబు ఈ రెండే వ్యాప‌కాలు. కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ప్రాధాన్య‌త ఇస్తాడు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యామిలీతో హాలీడేస్ కు వెళ్తుంటాడు. పిల్ల‌ల‌తో హాయిగా ఆడుతూ పాడుతూ ఫొటోలు దిగుతూ... ఆ చిత్రాల‌ను అభిమానుల‌కు కూడా ట్విట్ట‌ర్ ద్వారా పంచుతూ ఉంటాడు. అయితే, న‌మ్ర‌త అండ్ ఫ్యామిలీ అంటే మ‌హేష్ కు ఎంత ప్రేమ ఉంటుందో... మ‌హేష్ అండ్ పిల్ల‌ల‌పై కూడా న‌మ్ర‌త‌కు కూడా అంతే ప్రేమ ఉంటుంది క‌దా. పైగా ఈ ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయె! అయితే, ఎప్పుడూ మ‌హేష్ ల‌వ్ ఎక్ప్ ప్రెష‌న్ మాత్ర‌మే మ‌న‌కు తెలుస్తుంది. అందుకేనేమో... ఇప్పుడు న‌మ్ర‌త కూడా త‌న ప్రేమ‌ను ఇలా చాటుకుంది.

మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన వేడుక‌లు ఎంతో వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లు మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త వ‌చ్చారు. బ‌ర్త్ డే పార్టీలో అంద‌రి దృష్టినీ ఆమె ఆక‌ర్షించారు. అంత‌లా ఆక‌ర్షించింది ఏంటంటే... ఆమెకి చేతికి ఉన్న ఒక టాటూ! కుడిచేతి మీద ఒక స్పెష‌ల్ టాటూ వేయించుకున్నారు న‌మ్ర‌త‌. ఆ టాటూలో మ‌హేష్‌ - గౌత‌మ్‌ - సితార అంటూ పేర్లు ఉన్నాయి. త‌న‌కు త‌న ఫ్యామిలీ అంటే ఎంత ఇష్ట‌మో న‌మ‌త్ర ఇలా చాటి చెప్పార‌న్న‌మాట‌. కుటుంబం ప‌ట్ల త‌న‌కున్న ప్రేమ‌ను చెప్ప‌క‌నే ఈ టాటూ ద్వారా చెప్పిన‌ట్టు అయింది క‌దా!