తారక్ దుబాయ్ ట్రిప్ అందుకోసమేనా?

Tue Feb 12 2019 11:32:39 GMT+0530 (IST)

రాజమౌళి సినిమా అన్నంతనే అందరి చూపు దాని మీదనే. జక్కన్న పేరుకు తగ్గట్లే సినిమాను శిల్పం చెక్కినట్లుగా తీయటం ఆయనకు అలవాటే. ఇదే.. ఆయన కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా దరికి రాని పరిస్థితి. మిగిలిన దర్శకుల మాదిరి కాకుండా తీసే రెండేళ్లకో.. నాలుగేళ్లకో సినిమా తీయటం.. దాని కోసం భారీ కసరత్తు చేయటం లాంటివి రాజమౌళి స్టైల్. బాహుబలి తర్వాత తీస్తున్న ఆర్ ఆర్ ఆర్  మూవీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.గుట్టుగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం యాక్షన్ పార్ట్ ను చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా క్రేజీ మూవీని చేస్తున్నప్పుడు నటించే వారి వివరాలు చెప్పటం పాత ముచ్చట అయిపోయింది. ప్రతిది సస్పెన్స్ గా పెట్టేసి.. తమ సినిమా గురించి అదే పనిగా చర్చ జరిగేలా చేసే కొత్త ప్లాన్ ను అమలు చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన వేళ నుంచి పూర్తి అయ్యే వరకూ సినిమా మీద ఆసక్తి కించిత్ తగ్గకుండా ఉండేలా చేయటం.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సదరు సినిమా మీద చర్చను లైవ్ గా ఉంచేందుకు అనుసరించాల్సిన పద్దతులన్ని అనుసరిస్తున్నారు.

తాజాగా రాజమౌళి మూవీ ముచ్చట కూడా ఇంతే. హీరోలు తప్పించి.. హీరోయిన్లు ఎవరు?  విలన్ ఎవరు?  మిగిలిన నటీనటులు ఎవరు?  ఇలా ప్రతిది ప్రశ్నే తప్పించి సమాధానం లభించని పరిస్థితి. తాజాగా తారక్ షూటింగ్ బ్రేక్ నేపథ్యంలో దుబాయ్ వెళుతున్న వార్త బయటకు వచ్చింది.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వేళ.. బ్రేక్ ఏమిటి? అన్నది ప్రశ్న అయితే.. ఈ ట్రిప్పు ఫ్యామిలీతో కాదన్న మాట మరింత ఆసక్తికరంగా మారింది. దుబాయ్ కు తారక్ వెళ్లటం వెనుక హాలీడే కోసం కాదని..  ‘ఆర్ ఆర్ ఆర్’ కోసమని చెబుతున్నారు.

ఎన్టీఆర్ ఫిజిక్ మేకోవర్ కోసం కానీ.. ఏదైనా కొత్త తరహా విద్యను నేర్చుకోవటం కోసం కానీ కావొచ్చంటున్నారు. మొత్తంగా అయితే.. తారక్ దుబాయ్ ట్రిప్పు జాలీ జర్నీ ఎంత మాత్రం కాదు.. సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం కోసమన్న మాట బలంగా వినిపిస్తోంది. 2020లో విడుదలయ్యే ఈ సినిమాకు సంబంధించి రానున్న రోజుల్లో మరెన్ని సస్పెన్స్ ముచ్చట్లను వినాల్సి వస్తుందో?