ఎన్టీఆర్: రాజర్షి సాంగ్ తో కీరవాణి సిక్సర్

Wed Dec 12 2018 12:05:12 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటకే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  ఈ సినిమానుండి ఇప్పటికే  మొదటి లిరికల్ సాంగును రిలీజ్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ టీం తాజాగా రెండో లిరికల్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు.'రాజర్షి' అంటూ సాగే ఈ పాట 5 నిముషాల 24 సెకండ్లు ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు శివశక్తి దత్తా.. కె. రామ కృష్ణ.. ఎం ఎం కీరవాణి.  ఎన్టీఆర్ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఎంతో పొందికైన పదాలతో ఈ పాట లిరిక్స్ రాయడం జరిగింది. ఆదిశంకరాచార్యులచే విరచితమైన 'నిర్వాణ శతకం' నుండి కొన్ని శ్లోకాలు ఇందులో వాడారు. ఈ అందమైన సాహిత్యాన్ని శరత్ సంతోష్.. మోహన భోగరాజు.. కీరవాణి.. కాల భైరవ.. శ్రీనిధి తిరుమల మరింత అందంగా పాడారు. ఇది విన్నవెంటనే మనసుకు హత్తుకునే పాట.  కీరవాణి ఈ పాటకు ఒళ్ళు పులకరించేలా ట్యూన్ అందించడం విశేషం.  ఎన్టీఆర్ అభిమానులకు ఇదో సెలబ్రేషన్ అనడంలో సందేహం లేదు.

ఈ పాట నిజానికి కొద్దిరోజుల క్రితమే ఈ లిరికల్ సాంగ్ విడుదల కావలిసి ఉందట.  లేట్ అయితేనేం.. సాంగ్ మాత్రం రాకింగ్ అంతే. ఇక వేరే మాటలేదు. ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' జనవరి 9 న రిలీజ్ కానుంది. 

Click Here : https://www.youtube.com/watch?v=iQckakGluQ0