Begin typing your search above and press return to search.

సాహో రెండో సింగల్ వస్తోంది

By:  Tupaki Desk   |   16 July 2019 9:43 AM GMT
సాహో రెండో సింగల్ వస్తోంది
X
ఇటీవలే విడుదలైన సాహో మొదటి పాట సైకో సయ్యా ఆశించిన స్థాయిలో స్పందన దక్కించుకోకపోవడం అభిమానులను కొంత నిరాశ పరిచినా స్లో పాయిజన్ లాగా రిలీజయ్యాక కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ఇందులోని రెండో ఆడియో సింగల్ వచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ఊహించినట్టే ఇందులో ఒక్కో పాట ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించినట్టు తెలిసింది.

ఇప్పుడు వదలబోయే పాట గురు రంధ్వా కంపోజ్ చేశాడు. ఇతను బాలీవుడ్ లో మరీ పాపులర్ కాదు కానీ ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు. గత ఏడాది బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సోను కి టిటుకి స్వీటీకి సంగీతం అందించింది ఇతనే. దీంతో పాటు చాలా ఆల్బంస్ లో సూపర్ హిట్ పాటలు పాడి సింగర్ గానూ రాణిస్తున్నాడు. సాహో మొదటిపాట కంపోజ్ చేసిన తనిష్క్ బాగ్చి ట్యూన్స్ కూడా పాడాడు

ఇప్పుడు రాబోతున్న పాట "ఎన్ని సోని" అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇది కూడా హిందీ ఫ్లేవర్ లోనే అనిపిస్తోంది కాబట్టి తెలుగు లిరిక్స్ విషయంలో ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారేమో చూడాలి. మరో విషయం ఏంటంటే హిందితో సహా ఐదు బాషల్లోనూ గురు రంధ్వానే పాడాడు. లేడీ సింగర్ గా తులసి కుమార్ గాత్రం అందించింది. సాహో పంజాబీ వెర్షన్ కూడా ఉందట. సో ఇప్పుడీ ఎన్ని సోనీ ట్రాక్ ఇన్స్ టాంట్ గా వైరల్ కావడం చాలా అవసరం. సాహో లాంటి విజువల్ వండర్ కు తగ్గ పాటలు ఉంటేనే కిక్ డబుల్ అవుతుంది. సో సైకో సయ్యా రేపిన అనుమానాలు తీరాలంటే ఈ ఎన్ని సోని ఓ రేంజ్ లో రచ్చ చేయాల్సిందే