Begin typing your search above and press return to search.

ఆ లెక్కన చూస్తే శ్రీమంతుడు హిట్టే

By:  Tupaki Desk   |   2 Aug 2015 8:07 PM GMT
ఆ లెక్కన చూస్తే శ్రీమంతుడు హిట్టే
X
ఆగష్టు 7న సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన కానుకగా 'శ్రీమంతుడు' సినిమాని విడుదల చేయనున్న విషయం తెలిసినదే. ఈ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో చిత్ర బృందం విరివిగా ప్రచార కార్యక్రమాలలో పాల్గుంటుంది. అయితే టాలీవుడ్ లో డైరెక్టర్ ల సెకండ్ మూవీ ఫ్లాపైన కేసులే ఎక్కువ కనిపిస్తున్నాయ్ కాబట్టి ఈ ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ఎక్కడో ఒక మూలన అభిమానులను కలవరపెడుతుంది.

అయితే దర్శకుడి రెండవ సినిమా విషయంలో మహేష్ కి పాజిటీవ్ ట్రాక్ రికార్డ్ వుందనే చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండవ సినిమా 'అతడు' సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి రిపీట్ వేల్యూ వుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే పాతిక సంవత్సరాల తరువాత తెరకెక్కిన మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కూడా శ్రీకాంత్ అడ్డాల కి రెండవ సినిమానే. ఈ సినిమా కూడా సూపర్ హిట్. కాబట్టి శ్రీమంతుడు విజయంలో ఢొకా లేదని చెప్పుకుంటున్నారు.