Begin typing your search above and press return to search.

ఇంట్లో ప్రేయసి.. వంటింట్లో ఆమె చెల్లెళ్లు

By:  Tupaki Desk   |   28 Nov 2015 3:30 PM GMT
ఇంట్లో ప్రేయసి.. వంటింట్లో ఆమె చెల్లెళ్లు
X
మన చుట్టూ ఉండే మామూలు మనుషుల మధ్యే అక్రమ సంబంధాలు విచ్చలవిడిగా తయారైన ఈ రోజుల్లో అమెరికన్ సెలబ్రెటీల సంబంధాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించేవి కావు. అయినప్పటికీ ఇది కొంచెం చిత్రమైన వ్యవహారమే. ఓ టీవీ సెలబ్రెటీతో డేటింగ్ చేస్తూనే.. ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లగానే తన చెల్లెళ్లిద్దరితో పడక సుఖాన్ని ఆస్వాదించే టీవీ స్టార్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఆసక్తికర ఎపిసోడ్ వివరాలేంటో చూద్దాం పదండి.

అమెరికన్ టీవీ షోస్ ఫాలో అయ్యేవారికి స్కాట్ డిసిక్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అతను కోర్ట్నీ కర్దాషియాన్ అనే బ్యూటీతో వ్యవహారం నడుపుతుంటం కూడా అందరికీ తెలిసిన విషయమే. స్కాట్ ఆమెతో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. ఇద్దరూ పెళ్లి మాత్రం చేస్కోలేదు. ఐతే కోర్ట్నీకి తెలియకుండా కొన్నేళ్లుగా అతను ఆమె చెల్లెళ్లతో కూడా వ్యవహారం నడుపుతున్న సంగతి తాజాగా అమెరికన్ పత్రికల పతాక శీర్షికలకెక్కింది.

కోర్ట్నీ కర్దాషియాన్ పని మీద బయటికి వెళ్లగానే ఆమె చెల్లెళ్లు కైలీ జెన్నర్ - ఖ్లో కర్దాషియాన్ స్కాట్ బెడ్రూంలోకి దూరిపోయేవాళ్లట. ముగ్గురు కలిసి పడక సుఖాన్ని ఆస్వాదించే వారట. ఈ సంగతి కొన్నేళ్ల పాటు కోర్ట్నీకి తెలియకుండానే సాగింది. ఐతే ఈ మధ్య వ్యవహారం బట్టబయలవడంతో కోర్ట్నీ షాకైంది. ఇన్నేళ్లు తనను మోసం చేసి చెల్లెళ్లతో సెక్స్ బంధం సాగించిన స్కాట్ పై మండి పడుతోంది కోర్ట్నీ.