Begin typing your search above and press return to search.

సన్నీ ఇలా కూడా సూపర్

By:  Tupaki Desk   |   24 Sep 2017 9:28 AM GMT
సన్నీ ఇలా కూడా సూపర్
X
ప్రత్యేక పాటల్లో పరువాలతో రెచ్చి పోయే సన్నీ లియోన్ ఎలా కనిపించినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పోర్న్ చిత్రాలతో ప్రపంచం మొత్తం అభిమానుల్ని సంపాదించుకున్న సన్నీ ప్రస్తుతం బాషా భేదం లేకుండా అన్ని ఇండస్ట్రీలల్లో డ్యాన్సులతో తన టాలెంట్ ను చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు రాగిణీ MMS అంటూ పలకరించి ఆ తర్వాత ఐటెమ్ సాంగ్స్ చేస్తూ.. వస్తోంది.

అయితే గత కొంత కాలంగా అమ్మడు ఓ షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటోంది. అందరిని ఆకట్టుకునేలా ఒ సరికొత్త కథాంశంతో రాబోతున్నట్లు ఇదివరకే చెప్పింది. ప్రస్తుతం అందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ లు బాగానే జరుగుతున్నాయట. అందుకు సంబంధించిన ఎదో ఒక ఫొటోను సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హల్ చల్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ప్రోస్తేటిక్ తో కనిపించిన విషయం తెలిసిందే. ఆ ఫొటో మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యింది. సన్నీ ఏం చేయబోతోంది అనే కంటెంట్ తో కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే మళ్లీ ఒక చిన్న క్లిప్పింగ్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి అందరిని షాక్ కి గురి చేసింది. అందులో సన్నీ రాకాసి లా కనిపిస్తోంది. చర్మాన్ని చీల్చుతూ.. భయంకరమైన హావభావాలను కనబరిచింది. దీంతో నెటీజన్స్ సన్నీ ఇలా కూడా సెక్సీగా ఉందని ఎవరి స్టైల్ లో వారు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ అందాల సుందరి భయపెట్టే ఆ సినిమా గురించి ఇప్పుడు చెబుతుందో చూడాలి.