Begin typing your search above and press return to search.

వాటే డ్యాన్స్.. అఖిల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:30 PM GMT
వాటే డ్యాన్స్.. అఖిల్ బ్యూటీ
X
అక్కినేని అఖిల్ తొలి చిత్రం అఖిల్ తో తెరంగేట్రం చేసిన బ్యూటీ సాయేషా సైగల్. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. టాలీవుడ్ లో కెరీర్ కంటిన్యూ చేయలేకపోయింది. అయితే.. ఆ వెంటనే బాలీవుడ్ లో శివాయ్ అంటూ సక్సెస్ చిక్కడం.. తమిళ్ లో వరుస ఆఫర్స్ రావడంతో.. ఫుల్ బిజీగానే గడిపేస్తోంది సాయేషా.

అటు యాక్టింగ్ ట్యాలెంట్ తో పాటు అమ్మడిలో డ్యాన్సింగ్ ట్యాలెంట్ కూడా ఎక్కువే. ఈ జనరేషన్ బ్యూటీ కావడంతో.. సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. అందాల ఆరబోతలో మరీ శృతి మించదు కానీ.. ప్రేక్షకులకు ఎప్పుడేం ఇవ్వాలో ఈ చిన్నదానికి బాగానే తెలుసు. రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన వీడియో చూస్తే.. సాయేషాలో ఇంతటి డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇండియన్ అమెరికన్ అయిన హాలీవుడ్ పాప్ సింగర్ విద్యా వోక్స్ రీమిక్స్ చేసిన ఓపాటకు అద్భుతమైన స్టెప్పులతో అలరించేసింది సాయేషా సైగల్.

కేవలం నిమిషం పాటే ఈ వీడియో ఉన్నా.. మ్యూజిక్ కి తగినట్లుగా స్టెప్స్ వేస్తూ సాయేషా ఇరగదీసిన తీరు.. అభిమానులకు తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా టాప్ ట్రెండింగ్ లో సాయేషా డ్యాన్సింగ్ వీడియో ఉందంటే.. ఈ భామ ట్యాలెంట్ అర్ధమవుతుంది.