Begin typing your search above and press return to search.

హీరోయిన్లందరూ వీణ మీద పడ్డారేంటో

By:  Tupaki Desk   |   1 July 2016 1:45 PM GMT
హీరోయిన్లందరూ వీణ మీద పడ్డారేంటో
X
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఖాయమైనప్పటి నుంచి ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ కనిపిస్తోంది. అవార్డు ఫంక్షన్లలో చిరు స్టెప్పులతో హీరోయిన్స్ చితక్కొట్టేస్తున్నారు. పైగా అందరూ ఒకే పాటకు డ్యాన్స్ వేయడం మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంద్ర మూవీలో చిరు వేసిన వీణ స్టెప్.. ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. ఇప్పుడు ఆ పాటకు.. ఆ స్టెప్ కు కుర్ర భామలంతా మళ్లీ క్రేజ్ తీసుకొచ్చేస్తున్నారు.

సినీ మా అవార్డ్ ఫంక్షన్ లో ప్రగ్యా జైస్వాల్ వీణ స్టెప్పును సూపర్బ్ గా వేసింది. అది జరిగిన కొన్నాళ్లకే ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా వీణ స్టెప్ వేసేసింది. ఇప్పుడు సింగపూర్ లో జరుగుతున్న సైమా అవార్డుల ఫంక్షన్ లో.. ఇదే స్టెప్ ను వేసి చూపించింది అఖిల్ భామ సాయేషా సైగల్. అందరు ఇలా అదే సాంగ్ ని అదే స్టెప్ ని ఎంచుకోవడంలో.. ఫంక్షన్ నిర్వాహకుల పాత్ర ఎంతగా ఉందో చెప్పలేం కానీ.. చిరు స్టెప్పుని ఈ కుర్ర భామలు వేశారనే న్యూస్ మాత్రం బాగా హల్ చల్ చేసేస్తోంది.

అందాల భామలందరూ ఇలా చిరంజీవి వీణ స్టెప్ నే వేయడం వెనక.. చిరు రీఎంట్రీకి వెల్ కం పలకడం అనే కాన్సెప్ట్ అంతర్లీనంగా కనిపిస్తోంది. మరోవైపు.. మెగా ఫ్యాన్స్ కి హీరోలకు ఓ బిస్కెట్ విసురుతున్నట్లుగా కూడా అనుకోవచ్చు. అరడజన్ మంది హీరోలు ఫామ్ లో ఉన్న ఫ్యామిలీని.. ఆ కుటుంబం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటే.. అవకాశాలు వరుసగా వచ్చి పడతాయ్ కదా. ఆ లెక్క కూడా ఉందేమోనని ఓ సారి ఆలోచించాల్సిందే కదూ.