ప‌్రేమ గుడ్డిది .. అంతేగా!!

Wed Feb 20 2019 08:00:01 GMT+0530 (IST)

పెళ్లి కళ వచ్చేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా
..ముచ్చటగా మేళం వుంది ఆజా ఆజా
తద్దినక తాళం ఉంది ఆజా ఆజా
మంటపం రమ్మంటోంది ఆజా ఆజా..
 జంటపడు వేళయ్యింది ఆజా ఆజా ..
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..విక్టరీ వెంకటేష్ - అంజలీ జవేరీ జంటగా నటించిన `ప్రేమించుకుందాం రా` సినిమాలోనిది ఈ పాట. ఆ సినిమా చూస్తున్నంత సేపూ.. వెంకీ- అంజలి మధ్య ఏజ్ డిఫరెన్స్ తెలిసిపోయినా.. వెంకీ అద్భుత నటనాభినయం ముందు అదేదీ కనిపించలేదు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన్ మరో రియల్ లైఫ్ కపుల్ మధ్య కనిపిస్తోందన్నది యూత్ లో వేడెక్కిస్తున్న మాట. నిన్నగాక మొన్ననే ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా తమిళ హీరో ఆర్య - ముంబై బ్యూటీ సయేషా సైగల్ మధ్య ట్రూ లవ్ స్టోరి గురించి ఆసక్తికర చర్చ సాగింది. తొందర్లోనే మేం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ హీరో ఆర్య ఇదివరకే ప్రకటించాడు. ప్రేమికుల రోజున ఆ ఇద్దరూ దానిని అధికారికంగా కన్ఫామ్ చేసేశారు. అయితే ఆ ఇద్దరి మధ్యా ఏజ్ డిఫరెన్స్ ఎంత? అన్నదానిపై యువతరంలో ఆసక్తికరంగా డిస్కషన్ మొదలైంది.

సయేషా వయసు 21 .. ఆర్య వయసు 38 .. అంటే 17 సంవత్సరాల డిఫరెన్స్ కనిపిస్తోంది. అంటే మనోడు 2 డికేడ్ పెద్దోడన్నమాట!!  అయితేనేం ప్రేమ గుడ్డిది. దానికి వయసుతో పనే ఉండదు. మనసులు కలవాలి అంతే!!  ఆ లెక్కన చూస్తే అజిత్ - షాలిని జంట.. మలైకా- అర్జున్ కపూర్ జంటల మధ్య కూడా వయసు పరంగా చాలానే డిఫరెన్స్ ఉంది కదా! అది వేరు.. ఇది వేరు అంటారా? ప‌్రేమ గుడ్డిది .. అంతేగా!!