రేయ్.. సమ్మర్ కి హాయ్

Tue Mar 13 2018 12:55:58 GMT+0530 (IST)

ఎండాకాలం వచ్చేస్తోంది. ఇప్పటివరకూ చలికాలాన్ని బాగా ఎంజాయ్ చేసిన అందరూ.. ఇప్పుడు సమ్మర్ రాగానే వెకేషన్స్ కు సిద్ధమయిపోతున్నారు. కొంతమంది అందాల భామలు అయితే.. ఇప్పటికే వేసవి టూర్లు ప్రారంభించేశారు కూడా. సమ్మర్ వచ్చిందంటూ బికినీ వేసుకుని సముద్ర తీరంలో సేద తీరుతోంది 'రేయ్' బ్యూటి సయామీ ఖేర్.చిట్టి డ్రెస్సుతో బీచ్ లో సేదతీరుతూ తెగ హొయలు పోతోంది. బీచ్ బమ్ అంటూ తనకు తానే కితాబులు కూడా ఇచ్చేసుకుంటోంది. ఈ సొగసరి రెండున్నరేళ్ల క్రితమే టాలీవుడ్ లో రేయ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో మళ్లీ ఇక్కడ ఛాన్సులు రాలేదు. అయితే.. మిర్జియా అంటూ ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్ లో భారీ బడ్జెట్ మూవీనే చేసింది. కానీ ఈ చిత్రం కూడా అమ్మడి కలలను నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు చేతిలో అవకాశాలు లేవు కానీ.. రెండేళ్ల పాటు మాంచి ఫిట్నెస్ వర్కవుట్స్ అవీ చేసేసి బాగా ప్రిపేర్ అయిపోయింది.

సరైన ఛాన్స్ ఇస్తే ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూపించేందుకు.. ఇలా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది సయామీ ఖేర్. ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి తన రేంజ్ కు తగిన ఛాన్స్ రావాలని తెగ ట్రై చేస్తోంది సయామీ. మరి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చి.. ఈ భామను ఆదరించే ఆ మహానుభావులు ఎవరో చూడాలి.