మాధవన్ కి ఉత్తరం రాసిన సవ్యసాచి

Tue Apr 17 2018 12:01:54 GMT+0530 (IST)


అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా మాధవన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ఓపెన్ లెటర్ రాసింది సవ్యసాచి చిత్ర బృందం.ఈ మధ్యనే మాధవన్ తన పార్ట్ షూటింగ్‌ను ముగించుకుని చెన్నైకి బయలుదేరిన సందర్భంగా చిత్ర యూనిట్... ఆయన్ని మెచ్చుకుంటూ థ్యాంక్స్ లెటర్ రాసింది. అందులో ఏముందంటే... ‘మీ అద్భుతమైన నటన చూసి చిత్ర యూనిటంతా మీకు అభిమానులం అయిపోయారు. మీలాంటి నటుడిని టాలీవుడ్‌కి పరిచయం చేసే అదృష్టం మాకే దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా సినిమా ఒప్పుకోవడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టే!’ అంటూ కొనియాడింది సవ్యసాచి చిత్ర యూనిట్.  తమిళనాట స్టార్ స్టేటస్ సంపాదించుకుని... తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మాధవన్ నేరుగా తెలుగు సినిమాలో నటించడం మాత్రమే ఇదే తొలిసారి.

మాధవన్ నిజంగా ఓ ట్రూ జంటిల్మెన్ అంటూ చెప్పింది సవ్యసాచి బృందం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సవ్యసాచి జూన్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.