ఆ క్లాసు సావిత్రి ఫ్యామిలీకి అసలు నచ్చలేదట!

Wed Jan 16 2019 14:28:59 GMT+0530 (IST)

సంక్రాంతి సీజన్లో మొదటి సినిమాగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సంగతేమోగానీ సినిమాకు క్రిటిక్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.  సినిమాలో నెగెటివ్ అంశాలను దాదాపు గా టచ్ చేయకపోవడం తో పెద్దగా విమర్శలు రాలేదు.  నిజానికి ఎన్టీఆర్ ను మరీ గ్లోరిఫై చెయ్యడం చాలామందికి నచ్చలేదు.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో సావిత్రి పాత్రను చూపించిన విధానంపై సావిత్రి ఫ్యామిలీ అప్సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి.  సావిత్రి డబ్బు దుబారా చేయడం గురించి తెలిసిన ఎఎన్నార్ అప్సెట్ అవుతాడు.. మరోవైపు ఎన్టీఆర్ ఆమెకు అలా చేయడం సరికాదని చెప్తూ క్లాస్ పీకుతాడు. 'మహానటి' లో ఆల్రెడీ సావిత్రి జీవితాన్ని ప్రేక్షకులు చూసి ఉండడంతో ఈ పాత్ర పెద్దగా హాట్ టాపిక్ కాలేదు.  కానీ 'కథానాయకుడు' లో నిత్యా మీనన్ పోషించిన పాత్ర కొద్దిసేపే అయినా నెగెటివ్ గా చూపించారని సావిత్రి కుటుంబ సభ్యులు అప్సెట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ పాత్రను దేవుడు అన్నట్టుగా.. ఆయనకు ఏవీ లోపాలు లేనట్టుగా చిత్రించిన 'ఎన్టీఆర్' టీమ్ సావిత్రి విషయానికి వచ్చే సరికి నెగెటివ్ అంశాన్ని హైలైట్ చెయ్యాల్సిన  అవసరం ఏమొచ్చిందని  సావిత్రి అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ లోపాలు చూపించరు గానీ సావిత్రిని మాత్రం లోపాలు ఉన్నట్టుగా చూపిస్తారా అని వారు అడుగుతున్నారు.  'మహానటి' టీమ్ కు సన్నిహితుడైన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఎన్టీఆర్.. ఎఎన్నార్లు అమెరికాకు హార్ట్ సర్జరీకోసం వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు..  ఏ అలవాట్లు కారణం ఆ హార్ట్ సర్జరీకి కారణం అయ్యాయో కూడా చూపించి ఉంటే బాగుండేది కదా అని చురకలేశాడు.