Begin typing your search above and press return to search.

రామ్ కి శైలజ సెంటిమెంట్ పట్టుకుంది

By:  Tupaki Desk   |   31 May 2016 10:30 PM GMT
రామ్ కి శైలజ సెంటిమెంట్ పట్టుకుంది
X
ఎనర్జిటిక్ హీరో రామ్ చాలా కాలం ఎదురుచూసి.. ఎట్టకేలకు నేను శైలజతో ఓ రేంజ్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఫామ్ ను కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో.. చాలా జాగ్రత్తగా సబ్జెక్టులు ఎంచుకుంటున్నాడు. మరోవైపు కాన్సెప్ట్ పై ఎంత నమ్మకం ఉన్నా.. సెంటిమెంట్స్ విషయంలో కూడా ఎలర్ట్ గానే ఉంటున్నాడు రామ్.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తామిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కందిరీగకు సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు రామ్. అయితే.. ఈ సినిమాలో తనకు అచ్చొచ్చిన, కన్వీనియెంట్ గా ఉన్న కాస్టింగ్ నే ఎంపిక చేసుకుంటూ ఉండడం విశేషం. ఈ మూవీలో కోలీవుడ్ కేరక్టర్ నటుడు సత్యరాజ్ ను ఓ ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేశారు. మిర్చి - బాహుబలి తర్వాత.. సత్యరాజ్ కు టాలీవుడ్ నుంచి మంచి మంచి ఆఫర్స్ అనేకం వస్తున్నాయి.

ఇప్పుడు రామ్ మూవీ అయిన కందిరీగ సీక్వెల్ లో కూడా సత్యరాజ్ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నాను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది. సుప్రీం సూపర్ సక్సెస్ తర్వాత రాశి ఖన్నా సైన్ చేసిన మూవీ ఇదే. 14 రీల్స్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీని.. వీలైనంత త్వరగా ఫినిష్ చేసేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.