Begin typing your search above and press return to search.

మిర్చి నాన్న, శ్రీమంతుడు కొడుకు.. పండగే

By:  Tupaki Desk   |   6 May 2016 12:07 PM GMT
మిర్చి నాన్న, శ్రీమంతుడు కొడుకు.. పండగే
X
కొన్ని కేరక్టర్లు సినిమా అయిపోయాక కూడా ప్రేక్షకులను వెంటాడుతూ ఉంటాయి. అది మూవీలో మెయిన్ కేరక్టర్ అయినా కాకపోయినా.. చూసిన ప్రతీసారి ఆ పాత్రనే గుర్తు చేస్తుంటాయి. అలాంటిదే మిర్చి మూవీలో సత్యరాజ్ పోషించిన తండ్రి పాత్ర. అలాగే శ్రీమంతుడులో సూపర్ స్టార్ మహేష్ చేసిన కొడుకు రోల్ కూడా ఇలాంటిందే.

మిర్చి ఫాదర్ లాంటి ఉదాత్తమైన తండ్రి - శ్రీమంతుడు లాంటి ఉన్నతమైన ఆశయాలున్న కొడుకు.. ఈ ఇద్దరినీ పక్కపక్కన చేరిస్తే ఎలా ఉంటుంది? ఊహకే అద్భుతంగా అనిపించడం సహజం. రీసెంట్ గా రిలీజ్ చేసిన బ్రహ్మోత్సవం వర్కింగ్ స్టిల్స్ లో.. సత్యరాజ్ - మహేష్ బాబులను పక్కపక్కనే చూస్తుంటే తప్పనిసరిగా ఈ పోలిక గుర్తుకువస్తుంది. సాధారణంగా శ్రీకాంత్ అడ్డాల సినిమాలో మరీ అంత నెగిటివ్ కేరక్టర్లు కనిపించవు. ఉన్నంతలోనే మనిషిలోని చెడును చూపిస్తాడంతే. బ్రహ్మోత్సవంను పండగ రేంజ్ లో తీశాడనే విషయం ఇప్పటికే అర్ధమవుతోంది.

మరి ఈ సినిమాలో సత్యరాజ్ - మహేష్ బాబుల కేరక్టర్లు ఎలాంటివో ఇప్పుడే చెప్పేయలేం కానీ.. పోస్టర్లు మాత్రం భలే ఆకట్టుకుంటున్నాయి. రోజూ కొన్ని స్టిల్స్ విడుదల చేస్తూ.. మూవీపై ఆసక్తి పెంచేస్తున్న బ్రహ్మోత్సవం యూనిట్.. ఇవాళే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో మహేష్ ఓ క్లారిటీ ఇచ్చేస్తాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుపుకుంటున్న బ్రహ్మోత్సవం.. మహేష్ అభిమానులకు పండగ లాంటి అనుభూతిని మిగల్చడం ఖాయంగా చెప్పచ్చు.