Begin typing your search above and press return to search.

స్టార్ మేకర్ కొడుకు సత్తా చూపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   29 April 2017 5:18 AM GMT
స్టార్ మేకర్ కొడుకు సత్తా చూపిస్తున్నాడు
X
రైటర్ సత్యానంద్ కు స్టార్ హీరోలను తయారు చేసే వ్యక్తి అనే గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు కూడా ఈయన దగ్గరే నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. సత్యానంద్ కుమారుడు యాక్టింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు.

'సినిమా అనేది నా కంఫర్ట్ జోన్. ఇంజినీరింగ్ చదివి.. ఎంఎన్సీలో కూడా చేరాను. కానీ ఎంఎస్ నారాయణ కూతురు శశికిరణ్ అక్క ఆడిషన్ కి పిలిచినప్పుడు నా రూట్ మారిపోయి.. ఫిక్స్ అయిపోయింది. ఇంట్లో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత మూడేళ్లలో ఆరు సినిమాల్లో నటించాను. ఇప్పుడు లేడీస్ టైలర్ సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ లో నటిస్తున్నాను. టెక్నికల్ బ్రిలియన్స్ కు కేరాఫ్ అడ్రస్ లాంటి మూవీకి సీక్వెల్ లో నటించే అవకాశం లభించడం నా అదృష్టం' అని చెప్పాడు రాఘవేంద్ర. తన రోల్ పూర్తిగా కామెడీ యాంగిల్ లో ఉంటుందని అంటున్నాడు.

'కామెడీలో నేను బెస్ట్ అందిస్తాను. ఫ్యాషన్ డిజైనర్ లో నా పాత్రకు.. లేడీస్ టైలర్ సినిమాకు ఓ కనెక్షన్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ సూపర్బ్ గా ఉంటుంది కూడా. వంశీ గారితో పని చేయడం ఓ యూనివర్సిటీలో ఉన్నట్లుగా ఉంది' అన్నాడు రాఘవేంద్ర. తాను సత్యానంద్ కుమారుడిని అనే యాంగిల్ లో కాకుండా.. అందరి మాదిరిగా డీల్ చేయడంతో మరింతగా నేర్చుకునే అవకాశం చిక్కిందంటున్నాడు ఈ ఆర్టిస్ట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/