Begin typing your search above and press return to search.

ఏం చెప్పదల్చుకున్నారు.. ఏం చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Jun 2018 4:19 AM GMT
ఏం చెప్పదల్చుకున్నారు.. ఏం చూపిస్తున్నారు
X
సినిమాపై బెస్ట్ ఇంప్రెషన్ తీసుకురావడంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. సినిమాపై ఒక ఒపీనియన్ క్రియేటయ్యేది ఫస్ట్ లుక్ లోనే. అందుకే ఈ విషయంలో దర్శక - నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసేలా పోస్టర్ ఉండాలని అనుకోవడం తప్పులేదు. కానీ అది టోటల్ సినిమా కాన్సెప్ట్ నే తప్పుదారి పట్టించేలా ఉంటే మాత్రం దర్శక - నిర్మాతలది అతి తెలివేనని చెప్పక తప్పదు.

బాలీవుడ్ లో తాజాగా సత్యమేవ జయతే టైటిల్ తో ఓ సినిమా వస్తోంది. టైటిల్ ను బట్టి దాదాపుగా ఇది దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా అన్న విషయం ఇట్టే అర్ధమైంది. సినిమా టైటిల్ లోగో కూడా ఆర్మీ మెడల్ ను ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. భారతీయులందరిలోనూ దేశభక్తి పొంగి పొరలే రోజయిన్ ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం టోటల్ తేడాగా బయటకొదిలారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ఐషా శర్మ చాలా సెక్సీగా చూపిస్తూ కనిపిస్తుంది. సత్యమేవ జయతే టైటిల్ కు.. హీరోయిన్ సెక్సీ ఫిగర్ కు సంబంధం ఏమిటో అర్ధం కాక ప్రేక్షకులు బిత్తర పోతున్నారు.

సత్యమేవ జయతే హీరోయిన్ ఐషా శర్మ ఈ సినిమాతోన వెండితెరకు పరిచయం అవుతోంది. ఈమె ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా ఈమె అక్క మనకు బాగా తెలుసు. రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతలో నటించిన నేహాశర్మ చెల్లెలు ఈ సుందరాంగి. బాలీవుడ్ కండల వీరు జాన్ అబ్రహాం ఇందులో హీరోగా నటించాడు.