Begin typing your search above and press return to search.

మెగా హీరో.. పెద్ద కట్టే కట్టాడు

By:  Tupaki Desk   |   1 Oct 2016 11:16 AM GMT
మెగా హీరో.. పెద్ద కట్టే కట్టాడు
X
లోఫర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. ఒకేసారి రెండు సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నాడు. శ్రీను వైట్లతో మిస్టర్ వీటిలో ఒకటి. మొదట స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ.. రీసెంట్ గా ఊటీలో రెండో షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. కానీ ఊటీలో అనుకోని సంఘటనతో వరుణ్ తేజ్ కాలికి గాయం అయింది.

మెగా హీరోకి యాక్సిడెంట్ అయిందనే సంగతి తెలుసు కానీ.. దాని ఎఫెక్ట్ ఏంటో.. ఎంత పెద్ద గాయమో ఎవరికీ తెలీదు. పైగా షూటింగ్ ఆపేయకుండా కంటిన్యూ చేయమని చెప్పడంతో.. అంతా చిన్న గాయమే అనుకున్నారు. కానీ ఇప్పుడు హైద్రాబాద్ చేరుకున్న వరుణ్.. తనకు సాయం చేసిన ఓ ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్లతో దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్ వీల్ ఛైర్ లో కూర్చుంటే. దాన్ని తోసుకొస్తున్న సత్యం రాజేష్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి వెనక కనిపిస్తారు. కానీ వరుణ్ తేజ్ కాలికి కట్టిన పెద్ద కట్టును చూస్తే.. పెద్ద దెబ్బే తగిలిందనే సంగతి అర్ధమవుతుంది.

'ఊటీ నుంచి హైద్రాబాద్ కి తిరిగొచ్చేశా. ఈ ఇద్దరు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నాకు విషెస్ చెప్పిన ప్రతీ వారికీ చాలా చాలా థ్యాంక్స్. త్వరలో పరిగెట్టేస్తాను కూడా' అంటూ వరుణ్ తేజ్ కృతజ్ఞతతో పాటు కాన్ఫిడెన్స్ కూడా చూపించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/