Begin typing your search above and press return to search.

'పార్టీ' లో కట్టప్ప - శివగామిల రొమాన్స్‌

By:  Tupaki Desk   |   17 Nov 2018 3:30 PM GMT
పార్టీ లో కట్టప్ప - శివగామిల రొమాన్స్‌
X
తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చి పెట్టిన ‘బాహుబలి’ చిత్రంలోని శివగామి మరియు కట్టప్ప పాత్రలు ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కట్టప్ప పేరును పలు సార్లు ప్రస్థావించిన విషయం తెల్సిందే. ఇక శివగామి పేరు కూడా మారు మోగిపోయింది. మహిళలు శివగామి తరహాలో నీతి నిజాయితీగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని, ప్రేమగా ఉండాలని అంటున్నారు. అలా కట్టప్ప, శివగామి పేర్లు చాలా ఫేమస్‌ అయ్యాయి.

కట్టప్ప అనగానే బానిస అని, శివగామి అనగానే రాజమాత అని అంతా ఠక్కున అనేస్తారు. అయితే వీరిద్దరు ఇప్పుడు రొమాన్స్‌ చేయబోతున్నారు. తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పార్టీ’ అనే చిత్రంలో కట్టప్ప సత్యరాజ్‌, శివగామి రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి మద్య రొమాంటిక్‌ ట్రాక్‌ నడుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జై - శ్యామ్‌ - నాజర్‌ - రెజీనా - సంచిత శెట్టి - నివేద పేతురాజ్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రమ్యకృష్ణలు కీలకంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ చిత్రంలో సత్యరాజ్‌ - రమ్యకృష్ణల లేట్‌ వయసు ప్రేమ - రొమాన్స్‌ ను దర్శకుడు చూపించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శివగామి - కట్టప్పల ప్రేమ అంటూ ప్రచారం చేయడం వల్ల తెలుగులో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్‌ అవ్వడంతో పాటు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించే అవకాశం ఉంది.