చంద్రబాబు బయోపిక్.. పిచ్చ కామెడీ

Mon Sep 24 2018 22:07:47 GMT+0530 (IST)

టాలీవుడ్లో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తోంది. ‘మహానటి’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ జానర్ సినిమాలకు మాంచి ఊపొచ్చింది. తెలుగు రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నందమూరి తారక రామారావు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల జీవిత కథలతో సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల మీదా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వాటి ప్రోమోలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఐతే వైఎస్ సమకాలీనుడైన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద కూడా సినిమా తీసేయడానికి ఒక టీం రెడీ అయింది. ‘చంద్రోదయం’ పేరుతో ఈ మధ్యే సినిమా మొదలుపెట్టింది.
 
ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ రోజు లాంచ్ చేశారు. అందులో చంద్రబాబు పాత్రధారి లుక్ చూసి జనాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. బాబు పాత్రకు ఆ నటుడు సూటవ్వలేదు. సరైన మేకప్ వేయలేదు. గడ్డం అసలు సహజంగా లేదు. ఏదో పెయింట్ వేసినట్లుగా ఉంది ఆ గడ్డం చూస్తే. బాడీ లాంగ్వేజ్ కూడా సరిగా లేదు. కేవలం చంద్రబాబు తరహాలో డ్రెస్సింగ్ చేసి లాగించేసినట్లుంది. ఈ చిత్రానికి ‘బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది అసలు బయోపికా.. లేక స్ఫూఫా అంటూ కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. జీజేవీకే రాజేంద్ర ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. వెంకట రమణ నిర్మిస్తున్నాడు. అక్టోబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. మరి ఈ చిత్రంపై జనాలు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారో చూడాలి.