సల్లూ రేస్3పై ఎన్నెన్ని జోకులో!

Thu May 17 2018 10:29:53 GMT+0530 (IST)

అనితర సాధ్యం అనిపించే ఫీట్స్ అన్నీ.. సల్మాన్ ఖాన్ కు సాధ్యమే అనే విషయం రేస్3 ట్రైలర్ తో మరోసారి ప్రూవ్ అయింది. పారాగ్లైడింగ్ చేస్తూ ఫైటింగులు.. మిస్సైల్ లాంఛర్స్.. లాంటి ఎన్నో చిత్ర విచిత్రాలను రేస్3 ట్రైలర్ లో చూపించాడు సల్మాన్.తన అభిమానులను మెప్పించేందుకు ఎన్ని రకాల ఫీట్స్ చేయచ్చో.. అన్నీ ప్రయత్నించాడనే సంగతి అర్ధం అవుతోంది. కానీ నెట్ లో ట్రాలింగ్ కూడా ఈ రేంజ్ లోనే సాగుతోంది. రేస్3 ట్రైలర్ లోని ప్రతీ అంశాన్ని ట్రాలింగ్ తో వేటాడేస్తున్నారు. యాక్టింగ్ చేయడం రాకపోయినా.. మిస్సైల్స్ లాంఛ్ చేయడం నేర్చుకున్నాడన్నది ఓ కామెంట్. పారాగ్లైడింగ్ సూట్ ధరించి విచిత్రం చూస్తున్న సల్లూభాయ్ ని.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గాల్లో ఎగురుతూ చేసిన డ్యాన్సింగ్ మూమెంట్ తో పోల్చుతున్నారు. ఒక షాట్ లో సల్మాన్ ఎదురుగా ఒక కార్ చూపించి.. తీరా సల్మాన్ మిస్సైల్ లాంఛ్ చేసే సమయానికి 2 కార్లు కనిపించడం కూడా కామెడీ అయిపోయింది.

రేస్3 ట్రైలర్ చూశాక.. వ్యూయర్స్ పరిస్థితి ఇదీ అంటూ.. పద్మావత్ లో దీపికా పదుకొనే దండాలు పెడుతున్న పిక్స్ ను షేర్ చేశారు జనాలు. జాకీతో 'చెయ్యి ఇవ్వు.. పెళ్లి చేసుకోవడానికి కాదులే' అంటూ సల్మాన్ తనపై తాను వేసుకున్న జోక్ కూడా నెట్ లో బాగానే చక్కర్లు కొడుతోంది. ఇవే కాదు.. రేస్3 ట్రైలర్ లోని ఇంకా అనేక పాయింట్స్ పై జనాలు ఆటాడేసుకుంటున్నారు.