కట్టప్ప చంపట్లేదు.. సారీ చెప్పేశాడు!!

Fri Apr 21 2017 13:23:13 GMT+0530 (IST)

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి2 మూవీపై జనాలు ఇంతగా ఆసక్తి చూపడానికి కారణమైన ప్రశ్న. ఈ క్వశ్చన్ లేకపోయినా సినిమా మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ.. ఇప్పుడు మరింతగా పెరిగిందంతే. అయితే.. సింహాసనానికి కట్టుబానిస అయిన కట్టప్ప.. నిజంగానే బాహుబలిని చంపేస్తున్నాడు అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. తొమ్మిదేళ్ళ క్రితం కావేరీ జలాల వివాదంలో సత్యరాజ్ చేసిన కామెంట్స్.. కర్నాటక జనాలను బాగానే మండించాయి. ఆ ఇష్యూ కారణంగానే ఇప్పుడు కర్నాటకలో బాహుబలి2 రిలీజ్ కానివ్వబోమన్నది కన్నడ జనాల వాదన.

దీన్ని పరిష్కరించడానికి నిన్ననే రాజమౌళి కన్నడలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఎట్టకేలకు సత్యరాజ్ కూడా స్పందించేశాడు. సారీ చెప్పేశాడు. ''తొమ్మిదేళ్ళ క్రితం కావేరి నది జలాల విషయంలో నేను చేసిన కామెంట్లు కర్ణాటక వారిని బాధించాయని అర్దమైంది. కాని నేను కన్నడవారికి వారి రాష్ట్రానికి వ్యతిరికేని కాదు. 35 ఏళ్ల నుండి నా దగ్గర పనిచేస్తున్న నా అసిస్టెంట్ శేఖర్ కన్నడిగుడే. అంతకంటే ఇంకేం కావాలి.. నా ప్రేమ గురించి చెప్పడానికి. ఇక నా వ్యాఖ్యల కారణంగా ఫీలైన వారికి క్షమాపణలు చెబుతున్నాను. బాహుబలి అనే సినిమాలో నేనొక చిన్న వర్కర్ ను మాత్రమే. నా కారణంగా సినిమా రిలీజ్ ఆగిపోకూడదు. ఇదే విషయాన్ని అటు కన్నడిగులు.. ఇటు తమిళులు అర్దంచేసుకోండి ప్లీజ్'' అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు కట్టప్ప.

చూస్తుంటే మనోడు బాహుబలిని కర్ణాటకలో చంపట్లేదనే చెప్పాలి. ఈ స్టేట్మెంట్ పై ఇప్పుడు కన్నడ సమాఖ్యలు.. అలాగే తమిళవారు.. ఎలా స్పందిస్తారో చూడాలి.Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/