Begin typing your search above and press return to search.

ఈవిడ‌ను సౌత్ బెబో అనొచ్చు!

By:  Tupaki Desk   |   17 Sep 2018 5:30 PM GMT
ఈవిడ‌ను సౌత్ బెబో అనొచ్చు!
X
ఇటీవ‌లే సైమా అవార్డుల వేడుక‌లో ఓ తురుపు ముక్క ర‌చ్చ ర‌చ్చ చేసేసింది. చూడ‌టానికి అచ్చం బెబో క‌రీనానే త‌ల‌పించి స‌న్న‌జాజి సోయ‌గంలా త‌ళుక్కుమంది. ఓవైపు శ్రీ‌య‌ - ప్ర‌గ్యా జైశ్వాల్ - న‌భా న‌టేష్ - హ‌న్సిక లాంటి భామ‌లు త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శిస్తుంటే అంద‌రిలోనూ ఈ అమ్మ‌డు సంథింగ్ స్పెష‌ల్‌ గా క‌నిపించింది. ఇంత‌కీ ఎవ‌రీ బేబి? అని వెతికితే చాలానే ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి.

ఈ భామ పేరు సాషా చెట్రి. ఎయిర్‌ టెల్ 4జి గాళ్‌ గా సుపరిచితం. స్నేహితులంతా రిక్షా రాణి అని పిలుస్తూ ఏడిపిస్తారు. 26 ఏళ్ల ఈ అంద‌గ‌త్తె డెహ్రాడూన్ నుంచి ముంబైకి వ‌చ్చి ప్ర‌ఖ్యాత జేవియ‌ర్ కాలేజ్‌ లో డిగ్రీ పూర్తి చేసింది. అస‌లే అడ్వ‌ర్ట‌యిజ్‌ మెంట్ డిగ్రీ కావ‌డంతో వెంట‌నే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లోనూ అవ‌కాశం అందుకుంది. ఎయిర్‌ టెల్ 4జీ ప్ర‌క‌ట‌న‌తో అటుపై సినిమా వాళ్ల క‌ళ్ల‌లోనూ ప‌డింది. ఆ క్ర‌మంలోనే ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్ అనే చిత్రంలో అవ‌కాశం అందుకుంది. సాషా న‌టించిన ఈ సినిమా తొంద‌ర్లోనే రిలీజ్‌ కి రానుంది.

అయితే సైమా అవార్డ్స్ ఈవెంట్‌ లో సాషాను చూశాక మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఒక‌టే ఇదైపోతున్నారుట‌. చూడ‌టానికి అచ్చం సౌత్ క‌రీనాలా క‌నిపిస్తోంది. జీరోసైజ్‌ తో బెబో రేంజులో ర‌క్తి క‌ట్టిస్తోంది.. అన్న టాక్ వినిపించింది. సాషాకి పానిపూరి అంటే ఎంతో ఇష్టం. అలాగే చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ అంటే చెవి కోసుకుంటుంది. బ్లూ - పింక్ రంగులు ఇష్టమ‌ట‌. అలానే త‌న ఫేవ‌రెట్ డెస్టినీ ప్లేస్ ఏది? అంటే అమెరికా అని చెప్పింది. సాషాకి కథానాయిక‌గా మునుముందు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని జోష్యం చెబుతున్నారు.