Begin typing your search above and press return to search.

అక్కడ కూడా సరైన హిట్టేనా??

By:  Tupaki Desk   |   27 May 2016 1:30 AM GMT
అక్కడ కూడా సరైన హిట్టేనా??
X
ఇప్పటికే తెలుగులో రిలీజూ దాదాపు 35 రోజులు గడుస్తున్న వేళ.. ''సరైనోడు'' సినిమా ఏకంగా 70+ కోట్లు షేర్‌ వసూలు చేసి తన సత్తా చాటేసింది. అసలు స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ కెరియర్‌ లోనే ఇదో పెద్ద రికార్డు తెలుసా. ఈ సినిమా సక్సెస్ తో బన్నీ వరుసగా నాలుగు 50+ కోట్ల షేరున్న సినిమాలను కలిగిన ఏకైక హీరోగా తెలుగు సినిమా చరిత్రలో మిగిలిపోయాడు.

మన దగ్గర రిలీజైన ఓ నెలకు ఇప్పుడు ''యోధావూ'' అంటూ మలయాళీ వర్షెన్‌ ను రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కేరళలో మనోడు మల్లూ అర్జున్ గా ఎంత పాపులరో మనకు తెలిసిందే. కాని ఈసారి ''సరైనోడు'' సినిమాను మాత్రం ఇక్కడి టాక్‌ చూసుకుని కాస్త లేటుగా రిలీజ్‌ చేద్దాం అని ముందే అనుకున్నారు. అందుకే సినిమా ఇక్కడ హిట్టయ్యాక.. అక్కడ చక్కగా డబ్బింగ్‌ చేసుకుని.. ప్రమోట్‌ చేసుకుని.. రేపు (మే 27) సినిమాను ఏకంగా 100+ ధియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రంలలో నెగెటివ్‌ అండ్ బిలో యావరేజ్‌ టాక్‌ వచ్చాక కూడా.. సినిమా సూపర్ హిట్టయ్యింది. రికార్డు స్థాయి కలక్షన్లు వసూలు చేసింది. మరి మలయాళంలో ఏంటి పరిస్థితి. అక్కడ ఇంతటి మాస్‌ ను వాళ్ళు తట్టుకుంటారా? బోయపాటి శ్రీను డైరక్షన్‌ లో రూపొందిన ఈ సినిమాలో హాటీ రకుల్‌ ప్రీత్‌.. మలయాళీ పిల్ల క్యాథరీన్‌ త్రెసీ హీరోయిన్లుగా నటించారు.