Begin typing your search above and press return to search.

బన్నీ@70.. ఎంట్రీ అదుర్స్ కదూ

By:  Tupaki Desk   |   25 May 2016 12:27 PM GMT
బన్నీ@70.. ఎంట్రీ అదుర్స్ కదూ
X
టాప్ లీగ్ లో చోటు.. ఏ హీరోకయినా డ్రీమ్. ఆ రేంజ్ కి వచ్చేశాక.. ఇండస్ట్రీ టాప్ హిట్స్ లో తమ సినిమా ఉండాలనే టార్గెట్ సెట్ చేసుకుంటారు. అలా ఓసారి టాప్ 5లోకి రేసుగుర్రాన్ని చేర్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కానీ ఆ తర్వాత వచ్చిన బాహుబలి - శ్రీమంతుడు టాప్ వన్ టు ప్లేస్ లను ఆక్యుపై చేయడంతో.. బన్నీ ప్లేస్ ఆ లిస్ట్ లోంచి పోయింది. ఇప్పుడు సరైనోడు సినిమాతో 70 కోట్ల షేర్ వసూలు చేసి సగర్వంగా మళ్లీ టాప్ లీగ్ లోకి అడుగుపెట్టాడు బన్నీ.

సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరైనోడు.. విడుదలైన 32 రోజుల్లో ఈ రికార్డ్ ఫీట్ ను అందుకున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో కంప్లీట్ మాస్ రచ్చగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పుడు టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఐదో స్థానాన్ని అందుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే 57.95 కోట్లను కొల్లగొట్టిన సరైనోడు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 70.3 కోట్లు వసూలు చేశాడు. బాహుబలి - శ్రీమంతుడు - మగధీర - అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత స్థానంలోకి వచ్చి చేరింది సరైనోడు మూవీ. ఏపీ మొత్తంలోను - వైజాగ్ - వెస్ట్ గోదావరిలో.. బాహుబలి కాకుండా ఇండస్ట్రీ సెకండ్ ప్లేస్ లో నిలవడం విశేషం.

సీడెడ్ - గుంటూరు - కృష్ణా - ఈస్ట్ - కర్నాటకల్లో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఈస్ట్ - వెస్ట్ సహా కొన్ని ఏరియాల్లో ఓవర్ ఫ్లోస్ కూడా ఉండడంతో.. ఫుల్ రన్ డీటైల్స్ వచ్చే సమయానికి ఫైనల్ ఫిగర్స్ ట్యాలీలో కొంత తేడా రావచ్చు. మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర సరైనోడు మ్యాజిక్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది ఇండస్ట్రీ టాక్.