Begin typing your search above and press return to search.

సరైనోడు 100.. సరైన వందేనా??

By:  Tupaki Desk   |   29 July 2016 9:30 AM GMT
సరైనోడు 100.. సరైన వందేనా??
X
ఏప్రిల్‌ 22న విడుదలైన అల్లు అర్జున్ ''సరైనోడు'' సినిమా రేపటితో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంటోందట. ఈ సందర్భంగా స్టయిలిష్‌ స్టార్ గ్యాంగ్ కొందరు అప్పుడే యాడ్లతో హడావుడి చేస్తున్నారు కూడా. బాగానే ఉంది కాని.. అసలు ఈ 100 డేస్ అనేది సరైన వందగా మనం లెక్కపెట్టాలా లేదా?

ఒకప్పుడు సినిమాలంటే 25 వారాలు ఆడేవి. ఇప్పుడు సినిమాలు 25 రోజులు ఆడితే ఎక్కువ. చాలా సినిమాలకు మొదటి మూడు రోజుల కలక్షన్ తో భవితవ్యం మొత్తం తేలిపోతోంది. ఈ సమయంలో రివ్యూలు నెగెటివ్ గా వచ్చినా కూడా ''సరైనోడు'' సినిమా 76 కోట్ల షుమారు వసూలు చేసింది. అది చాలా పెద్ద ఫీట్‌ అనే చెప్పాలి. అక్కడి వరకు బాగానే ఉంది కాని.. మరీ 100 రోజుల పండగ కూడా కంప్లీట్‌ చేసింది అని చెప్పడం అంతగా నప్పట్లేదు. పైగా బన్నీ వంటి స్టేచర్ ఉన్న స్టార్ ఒక రొటీన్ సినిమాతో ఇలా 100 రోజులు పూర్తయ్యింది అని హడావుడి చేస్తే.. అది అస్సలు బాగోదు. ఎలాగో 76 కోట్లు రాబట్టడం అనేదే మాంచి ఫీటే. సినిమాలో దమ్ముంటేనే అంత డబ్బు వచ్చింది. అక్కడితే ఆ ఖుషీని సరిపెడితే బెటర్.

నిజానికి బన్నీ వంటి రేంజున్న హీరో దగ్గర నుండి.. ఇంకేదైనా మ్యాజిక్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు జనాలు. ఏదన్నా దేశం యొక్క సోషల్ పరిస్థితుల గురించో.. లేకపోతే మాంచి మెసేజ్ ఉన్న సినిమానో చేసి.. దానితో 100 రోజులు కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఏమంటావ్ బన్నీ బ్రదర్‌?