Begin typing your search above and press return to search.

2016 కి అతి పెద్ద హిట్‌ ఇదే

By:  Tupaki Desk   |   2 May 2016 7:27 AM GMT
2016 కి అతి పెద్ద హిట్‌ ఇదే
X
ఇప్పటివరకు 2016కు గాను తెలుగులో అతి పెద్ద హిట్లు ఏవి నాయనా అంటే.. నాన్నకు ప్రేమతో అండ్‌ సోగ్గాడే చిన్ని నాయనా అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు కూడా 50+ డిస్ర్టిబ్యూటర్‌ షేర్‌ వసూలు చేశాయి. అయితే వీటన్నింటినీ బీట్‌ చేసిన సినిమా ఏందీ అంటే.. అదే స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ''సరైనోడు'' అని చెప్పాలి.

ట్రేడ్‌ అంచనాల ప్రకారం.. నిన్నటి వీకెండ్‌ తో కలిపి.. కేవలం రిలీజైన 10 రోజుల్లో 53+ కోట్ల ''షేర్‌'' వసూలు చేసింది ''సరైనోడు''. క్రిటిక్స్‌ కు నచ్చకపోయినా.. క్లాస్‌ ఆడియన్స్‌ కు కష్టమే అనిపించినా.. మాస్‌ ప్రేక్షకులు.. మెగా అభిమానులు.. సినిమాకు రెడ్‌ కార్పెట్‌ వేశారు. దానితో అల్లు అర్జున్‌ అనుకున్న ఆ మాస్‌ రేంజ్‌ కు రీచ్‌ అయిపోయాడు. ఇప్పటికే బాహుబలి అండ్‌ శ్రీమంతుడు తరువాత మెగా డే 1 కలక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పుడు 20వ తారీఖు వరకు.. అసలు బ్రహ్మోత్సవం తప్పిస్తే ఇంకో సినిమాయే కాంపీటీషన్‌ లో లేదు. దానితో సరైనోడు సినిమా 60 కోట్లు క్లబ్‌ లో చేరే ఛాన్సు కూడా ఉంది.

మాస్‌ పంచ్‌ కు పవర్‌ ఆఫ్‌ సమ్మర్‌ హాలిడేస్‌ కలిస్తే.. దాని రిజల్టు ఎలా ఉంటుందో.. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రూవ్‌ చేశాడు. ఆ విధంగా 2016 సంవత్సరానికి ఇప్పటివరకు ఇదే అతి పెద్ద హిట్టుగా నిలిచింది. శ్రీమద్రమారమణ గోవిందో హారి!!