భరత్ అనే నేను.. సర్కార్.. అదే పాయింట్?

Mon Jun 25 2018 21:03:44 GMT+0530 (IST)

ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే చాలు రూమర్స్ క్రియేట్ అవ్వడం కామన్. ఓ విధంగా ఆ న్యూస్ పాజిటివ్ వే లో వైరల్ అయితే సినిమాకు చాలా లాభం. ప్రస్తుతం చాలా సినిమాల కథలపట్ల గాసిప్స్ వస్తున్నాయి. కథలన్నీ ఒక్కటే కాకపోతే స్క్రీన్ ప్లే లో మార్పులు చేస్తూ దర్శకులు వారి టాలెంట్ ను   నిరూపించుకుంటున్నారు.అయితే ఇప్పుడు మురగదాస్ మహేష్ బాబు సినిమా కాన్సెప్ట్ లో పాయింట్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మురగదాస్ విజయ్ తో సర్కార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. పూర్తిగా పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రానుంది. అయితే ఆ సినిమాపై  ప్రస్తుతం ఒక టాక్ వస్తోంది. మహేష్ - భారత్ అనే నేను సినిమా పాయింట్ నే మురగదాస్ ఎంచుకున్నాడట.

విదేశాల నుంచి వచ్చిన కుర్రాడు అనుకోకుండా స్వదేశానికి వచ్చి పాలిటిక్స్ లోకి ప్రవేశిస్తాడు. సర్కార్ సినిమా స్టార్టింగ్ పాయింట్ ఇదేనట - చెన్నై వచ్చిన యూఎస్ ఎన్నారై ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో విజయాన్ని సాధించాడు అనేది ప్రధాన అంశమని తెలుస్తోంది. మరి ఈ పాయింట్ తెలుగులో వర్కౌట్ అయినట్టుగానే కోలీవుడ్ లో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.