Begin typing your search above and press return to search.

వర్మ.. గాడ్ సెక్స్ అండ్ కాపీయేనా??

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:30 PM GMT
వర్మ.. గాడ్ సెక్స్ అండ్ కాపీయేనా??
X
నాకు నచ్చిన ప్రతీ సినిమాలోనుండి నాకు నచ్చినది ఏదైనా ఉంటే కాపీ కొట్టేస్తా. నేను బ్రూస్ లీ సినిమా కథలకు విజయవాడ రౌడీయిజం గొడవలను కలిపి చెప్పేసి 'శివ' సినిమా తీశాను. అలాగే పైరేటెడ్ వర్షన్ సినిమాలను నేను చూస్తాను కాబట్టి.. నేను పైరసీని వ్యతిరేకించను.. అంటూ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు కామెంట్లు చేశాడు. ఇప్పుడింతకీ ఇదంతా ఎందుకంటే.. పదండి అక్కడే వస్తున్నాం.

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఇలా 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' అంటూ రామ్ గోపాల్ వర్మ ఒక టీజర్ రిలీజ్ చేయగానే.. అసలు ఈ కథ.. ఆ ట్రైలర్ లో ఉన్న డైలాగులు.. అన్నీ నాయే అంటూ సర్కార్ 3 సినిమా రచయిత పి.జయ కుమార్ ఇప్పుడు కంప్లయింట్ చేస్తున్నాడు. అతను రాసుకున్న ఒక స్ర్కిప్టు (పుస్తకం కూడాను) నుండి దీన్ని కాపీ కొట్టేశారని.. అంతేకాకుండా.. అందులో ఉన్న ప్రతీ సింగిల్ లైన్ మక్కికి మక్కీ దింపేసింది మియా మాల్కోవా.. అందుకే రాముయే కారణం అంటూ ఆరోపణలు చేశాడు సదరు రైటర్. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదర్కోవడం రామూకి ఇది కొత్తేం కాదు.

గతంలోనూ రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర విషయంలో కూడా అలాగే జరిగింది. అక్కడ వెరైటీగా మనోడు ధర్మ-రక్ష అనే ఇద్దరు డైరక్టర్లుతో ఈ సినిమా షూటింగును జగపతి బాబు హీరోగా మొదలుపెట్టి.. తరువాత ఆ కథ తనకు బాగా నచ్చేయడంతో.. ఆ షూటింగ్ ఆపేసి.. తను రంగంలోకి దిగాడు. కథ నచ్చడమే కాదు.. ఆ కథ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వివాదం చెలరేగడంతో.. ఈ కథకు బీభత్సమైన పొటెన్షియాలిటీ ఉందని గ్రహించిన వర్మ.. వారిని పక్కకు తప్పించి తన సొంత సినిమాగా దాన్ని తీసుకున్నాడనేది అభియోగం. కాని దీని గురించి ఓపెన్ గా ఎప్పుడూ ఆరోపణలు చోటుచేసుకోలేదు. ఇక సర్కార్ 3 సినిమాలో విషయంలో నీలేష్‌ అనే రైటర్ కూడా తనకు 'మూల కథ' క్రెడిట్ ఇవ్వలేదని కోర్టుకెక్కాడు.

అయితే ఇప్పుడు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఆరోపణలపై వర్మ స్పందిస్తూ.. నేను షార్ట్ ఫిలిం లేదా ఫీచర్ ఫిలిం తీయలేదు. నాకు ఈ సినిమా ద్వారా డబ్బు ఏమీ రాదు. సరదాగా ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తున్నానంతే.. కాబట్టి కాపీ రైట్ ఇష్యూ ఎందుకు వస్తుంది? అంటూ ప్రశ్నించాడు వర్మ. దీనిపై స్పందించిన జయ కుమార్.. 'అసలు నీ సొంత వర్క్ నువ్వు తీస్తే అది సొంతది అవుతుంది. పక్కోడిది దొబ్బేసి డబ్బుకోసం తీసిన తీయకపోయినా కూడా.. అసలు తీశావంటే అది కాపీయే. అదే కాపీరైట్ చట్టం. కోర్టులో చూసుకుందాం' అంటూ కామెంట్ చేశాడు.

మొత్తానికి 26న రిలీజ్ కాబోతున్న వీడియోకు.. ఇప్పుడు ఫ్రీగా బాగా ప్రచారం పొందేస్తున్నాడు వర్మ. ఆల్రెడీ పోర్న్ స్టార్ ఉంది.. పైగా న్యూడ్ గా చేసింది.. అంతేకాకుండా దాని గురించి రోజుకోసారి ప్రచారం చేస్తున్నాడు వర్మ.. ఇప్పుడు కాపీ రైట్ ఎపిసోడ్.. ఇంకాస్త ప్రచారం దండిపెడుతోంది.