Begin typing your search above and press return to search.

సరిలేరుకి స్ఫూర్తి తీసుకున్నారా ?

By:  Tupaki Desk   |   24 Jun 2019 8:33 AM GMT
సరిలేరుకి స్ఫూర్తి తీసుకున్నారా ?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు లండన్ ట్రిప్ తర్వాత తిరిగి వచ్చేశాడు. సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడు. సరిలేరు నీకెవ్వరూ వచ్చే నెల 5 నుంచి కాశ్మీర్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుపెట్టనున్నారు. మిలిటరీ దుస్తుల్లో ఫిట్ గా కనిపించేందుకు మహేష్ ఇప్పటికే రెడీ అయ్యాడట. అది లేటెస్ట్ పిక్స్ లో కనిపిస్తోంది కూడా. చాలా కీలకంగా అనిపించే ఈ వార్ ఎపిసోడ్ ని దర్శకుడు అనిల్ రావిపూడి రెండు హిందీ సినిమాల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఒకటి బోర్డర్ రెండోది యుఆర్ ఐ. బాలీవుడ్ లో ఇప్పటికే వీటినే బెస్ట్ వార్ బేస్డ్ మూవీస్ గా చెప్పుకుంటారు. బోర్డర్ లో ఎమోషనల్ డ్రామాతో రోమాలు నిక్కబొడుచుకునేలా శత్రు సైనికులతో యుద్ధ సన్నివేశాలు ఉంటాయి. ఇది వచ్చి పాతికేళ్ళు అవుతున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ కి బెస్ట్ ఫెవరెట్. ఇక యుఆర్ఐ ఈ ఏడాది మొదట్లో వచ్చిన బాక్స్ ఆఫీస్ వండర్. విమర్శకుల నుంచి సైతం ప్రశంశలు అందుకుంది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 220 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన యుఆర్ ఐలో అల్ట్రా స్టైలిష్ వార్ ఎపిసోడ్స్ ఉన్నాయి. గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ఉన్నాయి. మహేష్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించే భాగాల్లో వీటిని కొంత బేస్ గా తీసుకుని అభిమానులకు ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా అనిల్ డిజైన్ చేసాడట. ఇప్పటిదాకా కామెడీకె పెద్ద పీఠ వేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి మరి ఈ వార్ సీక్వెన్స్ లో ఎలా బాలన్స్ చేస్తాడో చూడాలి. అయినా సినిమా మొత్తం ఇవే ఉండవు కాబట్టి తనదయిన రెగ్యులర్ మాస్ మసాలా ఉండే ఉంటుంది