Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ : సైడ్ నుండి సర్దార్

By:  Tupaki Desk   |   31 July 2015 7:35 AM GMT
ఫస్ట్ లుక్ : సైడ్ నుండి సర్దార్
X
తన ఫాన్స్ కు ఏదైనా ఇవ్వాలని తపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనే ఒక పోస్టర్ ఒకటి కంపోజ్ చేయించి మరీ రిలీజ్ చేయించాడు. ఈ విషయాన్నీ స్వయంగా తెలియజేసాడు నిర్మాత శరత్ మరార్. ఓ రెండు రోజుల క్రితమే గబ్బర్ సింగ్ సీక్వెల్ అయిన "సర్దార్" సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఫాన్స్ కు ఇంకా ఏమైనా డౌట్స్ వుంటే అవన్నీ తీర్చేయాలని అనుకున్నాడేమో పవన్ ఇప్పుడు ఈ పోస్టర్ ఒకటి రిలీజ్ చెశాడు. పైగా అందులో ఈ సినిమా థీమ్ ఎలా వుంటుందో చూపించే ప్రయత్నం చేసినట్లున్నాడు. చూస్తున్నారుగా అక్కడ సైడ్ నుండి "సర్దార్" నుంచొని వుంటే, ప్రక్కనే ఆయన గుర్రం కామెర్ కు ఫోజులు ఇస్తోంది. సినిమా టైటిల్ డిజైన్, లేకపోతె హీరో లుక్ వగైరా ఏమి లేకపోయినా కూడా, ఫోటో లో వున్నాడు పవన్ అని తెలిస్తే చాలు అభిమానులకు పండగే మరి.