Begin typing your search above and press return to search.

ఎస్.జె.సూర్య వెళ్లిపోవడం శుభ సూచకమా?

By:  Tupaki Desk   |   19 March 2017 4:44 AM GMT
ఎస్.జె.సూర్య వెళ్లిపోవడం శుభ సూచకమా?
X
‘కాటమరాయుడు’ సినిమాకు ముందుగా అనుకున్న దర్శకుడు ఎస్.జె.సూర్య అన్న సంగతి తెలిసిందే. పవన్ తో ఒకప్పుడు ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ చేసిన సూర్య.. ఆపై ‘పులి’ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. అంతటితో లెక్క బేలన్స్ అయిపోయింది. ఐతే పవన్ అతడికి ఇంకో అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంలో పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది అప్పట్లో. మరి అభిమానుల ఫీడ్ బ్యాక్ ను బట్టి ఎస్.జె.సూర్యను తప్పించారా.. ఇంకేవైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. అతనైతే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. సూర్య స్థానంలోకి డాలీ వచ్చాడు.

ఐతే ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో పవన్ కానీ.. నిర్మాత శరత్ మరార్ కానీ.. మాట వరసకైనా సూర్య పేరు ప్రస్తావించలేదు. పైగా శరత్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే సూర్య ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోవడం ఒక శుభసూచకం అన్న అర్థం వచ్చింది. ‘కాటమరాయుడు’ సినిమా మొదలయ్యాక అన్నీ మంచి విషయాలే జరిగాయి అని చెబుతూ.. ‘కాటమరాయుడు’ అనే టైటిల్ లభించడం.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన ఆడియో ఇవ్వడం గురించి చెబుతూ.. డాలీ ఈ ప్రాజెక్టులోకి రావడం గురించి కూడా ప్రస్తావించాడు శరత్. డాలీ రావడం మంచి విషయం అన్నపుడు సూర్యతో అంత కంఫర్ట్ గా లేనట్లే కదా? అసలు సూర్య ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు వెళ్లిపోయాడనే విషయంలో జనాల్లో ఉన్న సందేహాల్ని తీర్చకపోగా.. డాలీ రావడం మంచి విషయం అన్నారంటే ఎక్కడో తేడా జరిగినట్లే ఉంది మరి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/