డ్రెస్ ఏదైనా.. అందం ఒకటే

Sat Jan 20 2018 12:35:31 GMT+0530 (IST)

ఈమధ్య బాలీవుడ్ లో స్టార్ల కంటే వారి పిల్లలే ఎక్కువ క్రేజ్ సంపాదిస్తున్నారు. అందులో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పిల్లల హవా బాగా నడుస్తోంది అని చెప్పొచ్చు. అటు సైఫ్ కి కరీనా కి పుట్టిన తైమూర్ అలీ ఖాన్ సోషల్ మీడియా లో స్టార్ అయితే సైఫ్ కి తన మొదటి భార్య అమృత సింగ్ తో పుట్టిన సారా అలీ ఖాన్ అటు సోషల్ మీడియా లో మాత్రమే కాదు వార్తల్లో కుడా స్టారే.24 ఏళ్ల ఈ చిన్నది కేవలం తన చూపుతోనే ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేయగలదు. కొన్నిసార్లు ట్రెడిషనల్ గాను మరికొన్ని సార్లు మోడరన్ గాను సారా కెమెరా కంటికి చిక్కి వార్తల్లో హెడ్ లైన్స్ అయిపోతోంది. మొన్న ఎదో ఫంక్షన్ కి కుర్తా లో పద్దతిగా కనిపించిన ఈమె ఈమధ్యనే బాంద్రా లో యోగా క్లాస్ కి వెళుతూ వెస్ట్రన్ డ్రెస్ లో మెరిసింది. అటు ఎత్నిక్ వేర్ అయినా ఇటు వెస్ట్రన్ అయినా ఈమె అందం మాత్రం చలికాలంలో చెమటలు పట్టిస్తోంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల కు కంటే అందంలో ఏమాత్రం తీసిపోని సారా ఇపుడు నటనలో కూడా వారికి గట్టి పోటీ ఇవ్వడానికి హీరోయిన్ గా మారింది.

సారా అలీ ఖాన్ - సుశాంత్ సింగ్ రాజపుత్ తో కలిసి కేధర్నాథ్ అనే చిత్రంలో నటించబోతోంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించబోతుండగా టి సిరీస్ - క్రియాజ్ ఎంటర్ టైన్ మెంట్ - బాలాజీ మోషన్ పిక్చర్స్ మరియు గై ఇన్ ద స్కై పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన కేధర్నాథ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.