Begin typing your search above and press return to search.

సారబ్జిత్‌.. ఈ లాజిక్‌ కూడా ఆలోచించండి

By:  Tupaki Desk   |   26 May 2016 5:25 PM GMT
సారబ్జిత్‌.. ఈ లాజిక్‌ కూడా ఆలోచించండి
X
ఇప్పుడు సారబ్జిత్‌ సినిమా అనుకున్నంత రేంజులో ఆడట్లేదు అనేది వాస్తవం. అసలు ఈ సినిమా నిజంగానే దేశభక్తి రసభరితమైన సినిమా అయినప్పుడు ఎందుకు జనాలకు పెద్దగా నచ్చలేదు? ఎయిర్ లిఫ్ట్ నచ్చినట్లు ఈ సినిమా ఎందుకు ఆకర్షించలేదు అనే విషయం ఎవ్వరికీ అర్ధంకావట్లేదు. నిజంగానే ఇలాంటి డౌట్లు వస్తే మాత్రం.. ఇక్కడే మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి.

సారబ్జిత్‌ సింగ్‌.. పొరపాటును పాకిస్తాన్‌ లోకి అడుగుపెడితే.. మనోడ్ని ఒక బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి అనుకొని అతన్ని జైల్లో వేశారు. ఆ తరువాత అతన్ని వదలకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక ఇక్కడ పేట్రియాటిజమ్‌ అని మనం భుజాలు గుద్దుకోవడానికి ఆస్కారం లేని విషయం ఏంటంటే.. మన దేశంలో కూడా చాలామంది ఖైదీలు ఇంకా ఎటువంటి తీర్పులు రాకుండా జైళ్ళలోనే మగ్గుతున్నారు. వట్టి పుణ్యానికే ఏదో చిన్న కారణంతో అరెస్టయ్యి.. అసలు కోర్టు హాజరే నోచుకోకుండా.. దాదాపు 10 ఏళ్ల నుండి జైల్లో పెట్టబడిన ఖైదీలు చాలామందే ఉన్నారు. వారి గురించి పట్టించుకునేదెవరు?

వేరే దేశంలోని జుడీషియరీలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది సారబ్జిత్‌ సినిమా.. కాని మన దగ్గర జరుగుతున్న అగత్యాలకు ఆన్సర్ చెప్పనంత వరకు.. ఇక్కడి ఎడ్యుకేటెడ్‌ యూత్‌ కు సినిమా నచ్చే ఛాన్సేలేదు. అలాగే కేవలం బోర్డర్‌ బయటున్న పాకిస్తాన్‌ గురించి బీభత్సమైన విలనీ ఎంత చూపించినా.. లాజికల్ గా మన తప్పులను దిద్దుకోనంత సేపూ.. ఇలాంటివి పెద్దగా వర్కవుట్‌ అవ్వవు. భజరంగీ భాయిజాన్‌ సినిమాలో కూడా పాకిస్తాన్ జనాలను ఎంతో పాజిటివ్‌ గా చూపించారు కాబట్టే.. సినిమా ఇక్కడ కూడా నచ్చింది. పేట్రియాటిజం అంటే మన దేశాన్ని ప్రేమించడం కాని.. పక్క దేశాన్ని ద్వేషించడం కాదు.