ఈ బికినీకి కాంస్య పథకం ఇవ్వాలి

Fri Aug 10 2018 20:00:26 GMT+0530 (IST)

బికినీల యందు సిల్వర్ బికినీ వేరయా విశ్వధాభి రామ వినురవేమ! ఈ బికినీ చూశాక ఆమాత్రం పోయెట్రీ పుట్టుకురావడం సహజం. ఆ వెండి తళుకులు ఆ రేంజులో మురిపిస్తున్నాయి. ఒంపు సొంపుల వయ్యారాల్ని ఆరాంగా ఆరబోస్తున్న ఈ అమ్మడి కులుకులు చూస్తుంటే గుబులు పుట్టనిది ఎవరికి?  చూడగానే కాంస్య పథకం కట్టబెట్టేలేమో! అన్నంతగా కవ్విస్తున్న ఈ అమ్మడు ఇంతకీ ఎవరు? అంటారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.ఈవిడ టెలివిజన్ నటి. పేరు సింపుల్‌గా సారా ఖాన్. పేరు వినగానే సారా అలీఖాన్ అని కానీ ఫిక్సయిపోయేరు? అక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ సారా వేరు.. ఈ సారా వేరు. ఆ సారా ముందు ఇంకే సారా నిలబడలేదు. ఈసారా యాంగిలే వేరుగా ఉంది ఇన్ స్టాగ్రమ్ పరిశీలిస్తే. అక్కడ సన్నీ - రాఖీల్ని మించిన హొయల్ని ఒలకబోస్తూ ఇబ్బడి ముబ్బడిగా ఘాటైన ఫోజులు ఉక్కిరి బిక్కిరి చేసేయడం ఖాయం. అసలింతకీ ఎవరీమె? అంటే.. ఈవిడో సీరియల్ నటి. ఇండియా - పాకిస్తాన్ ఇరుదేశాల్లోనూ ఈ అమ్మడికి నెట్‌వర్క్ ఉంది. ఆ పరిచయాలతోనే హిందీ సీరియళ్లలోనూ నటించే స్కెచ్ వేసిందిట. బికినీ వేయడానికి ఓ స్టైల్ ఉంటుందని - ఆ బికినీకి ప్రత్యేకమైన వెండి తళుకులు అద్దొచ్చని ఈ అమ్మడు ప్రత్యక్షంగా చూపించింది. ఇంకేం ఉంది .. యూత్ వాట్సాప్ లు - సామాజిక మాధ్యమాల్లో ఈ బికినీ జోరుగా వైరల్ అయిపోయింది.

ఒంపు సొంపు ఒగలు గిగలు ఉన్న పాకిస్తానీ బ్యూటీ కాబట్టి ఈ క్వాలిటీస్ కి కుర్రజనం భేజారెత్తిపోతున్నారు. ఇవే అందచందాల్ని ఎలివేట్ చేస్తే ఇటు టాలీవుడ్ - కోలీవుడ్ సైతం ఛాన్సులిచ్చి ఆహ్వానించడం గ్యారెంటీ. ఇంతవరకూ మన దర్శకనిర్మాతలకు ఈ అమ్మడు స్ట్రైక్ అయ్యి ఉండకపోవచ్చు. వన్స్ స్ట్రైక్ అయితే ఇక క్లిక్కయినట్టే. సన్నీలియోన్ - రాఖీ సావంత్ రేంజు కాకపోయినా ఆ తర్వాత బిగ్రేడ్ లో అయినా చెలరేగిపోయే ఛాన్స్ తనకు దక్కడం ఖాయం.