Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పంజా పిల్ల పిచ్చెక్కించింది

By:  Tupaki Desk   |   25 Jun 2017 8:03 AM GMT
ఫోటో స్టోరి: పంజా పిల్ల పిచ్చెక్కించింది
X
మంగళూర్ భామ అయినా మస్కట్ లో పుట్టిన భామ సారా జేన్ డయాజ్. కటౌట్ నుంచి కాసింత డిఫరెంట్ గా తగిలే ఈ భామ.. ఇండియన్ మూవీస్ లో బాగానే వెలుగుతోంది. కౌంట్ పరంగా తక్కువగా ఉన్నా.. కంటెంట్ విషయంలో స్ట్రాంగ్ మూవీస్ నే ఎంచుకుని మరీ చేస్తున్న ఈ మిస్సిండియా బ్యూటి.. పంజా మూవీలో పవన్ తో కలిసి సందడి చేసింది.

ఆ తరువాత సౌత్ లో పెద్దగా ట్రై చేయలేదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఏడాదికో సినిమా చొప్పున లాగించేస్తోంది. ఈ ఏడాది వైస్ రాయ్స్ హౌస్ అనే మూవీలో కనిపించింది కూడా. అయితే.. పంజాలో అంటే పద్ధతిగా కనిపించింది కానీ.. వాస్తవానికి ఈ భామ ధరించే డ్రెస్సులు అలా ఉండవు. అల్ట్రా మోడర్న్ వెస్టర్న్ వేర్ లో విపరీతంగా కనిపించేస్తూ.. ఆన్ లైన్ జనాలకు ఎప్పటికప్పుడు షాకులు ఇచ్చేస్తూ ఉంటుంది సారా జేన్ డియాజ్. ఆదివారం రోజున తను ఎలా ఎంజాయ్ చేస్తోందో చెప్పేందుకు.. ఈ ఫోటో షేర్ చేసింది సారా!!

పంజా పిల్ల పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన వాళ్లకు పిచ్చెక్కిపోవడం ఖాయం. మైక్రో బికినీ వేర్ లో ఆ రేంజ్ లో అందాలతో విందు చేసేసింది సారా జేన్. 'హాయ్ ఆల్.. హ్యాపీ సండే' అంటూ పలకరిస్తోంది కానీ.. అందరి చూపులు అమ్మడి అందాలపైనే ఫోకస్ అయిపోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/