ఫోటో స్టొరీ: జివ్వనిపిస్తున్న పంజా బ్యూటీ

Tue Jan 15 2019 07:00:01 GMT+0530 (IST)

సారా జేన్ డయాస్ పేరు ఎవరికీ తెలిసినా తెలియకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం తెలిసే ఉంటుంది.  'పంజా' సినిమాలో పక్కింటి అమ్మాయి టైపులో ట్రెడిషనల్ గా కనిపించింది. కానీ ఆ సినిమా విజయం సాధించకపోవడంతో ఎక్కువ లేట్ చెయ్యకుండా ముంబై ఫ్లైట్ ఎక్కేసింది..బాలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. దాదాపు అరడజను సినిమాలు చేసింది గానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.సినిమాల సంగతి పక్కనబెడితే ఈ భామ ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది. 2007 లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని సాధించింది.  ఛానల్ V లో వీజేగా కూడా తళుక్కున మెరిసింది.  మరి ఈ బ్యాక్ గ్రౌండ్ చాలు కదా.. హాటుగా ఘాటుగా కనిపించేందుకు?  అందుకే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సెగలు రేపుతూ ఉంటుంది. ఈరోజు భోగి మంట వేసింది.  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "నువ్వు బోటు మిస్ అయ్యావా?" అని క్యాప్షన్ ఇచ్చింది.   ఆ బోటు ఏంటో ఎవరు మిస్ అయ్యారో తెలీదుగానీ.. అమ్మడి కలర్ఫుల్ బికినీనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బ్లూ కలర్ బికిలో ఫుల్ క్లీవేజ్ షో చేసింది. డీప్ నెక్ ఉన్న కట్ సరిపోనట్టు ఆ బికినీకి ఒక జిప్పు కూడా ఉంది.  ఆ జిప్పు ను కాస్త కిందకు లాగి హాట్ నెస్ ను మరింతగా పెంచేసింది. కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ ను ఒక చేత్తో అలా సర్దుకుంటున్నట్టుగా... బోటును పరిశీలించి చూస్తునట్టు గా పోజిచ్చింది.  అమె పరిశీలన వేరే.. నెటిజనుల పరిశీలన వేరే. ఎవరి పరిశీలన వారిది!